టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక బయోపిక్ గురించి బాగా చర్చ నడుస్తోంది.

ఒక వ్యక్తి గురించి ఎందుకు ఇలా పోటీ పడి మరి సినిమాలు తీస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారు.

అది కూడా ఏ స్వాతంత్ర్య సమరయోధుడి కధ కాదు.. ఒక స్టూవర్టుపురం దొంగ గురించి.

మాస్ మహారాజ రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘స్టూవర్టుపురం దొంగ’గా పోటీ పడి సినిమాలు తీస్తున్నారు.

1913లో ఎరుకుల కులస్థులను క్రిమినల్సుగా ముద్రవేసి.. జైలుకు బదులుగా వారందరిని ఒక కాలనీగా ఏర్పాటు చేశారు.. అదే స్టూవర్టుపురం అయ్యింది.

గుంటూరు జిల్లా బాపట్లకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ స్టూవర్టుపురం. 

స్టూవర్టుపురం దొంగల ముఠాలో నాగేశ్వరరావు ఒకడు. అతని తెగువ, ధైర్యానికి టైగర్ అని బిరుదు కూడా వచ్చింది.

అతను అందరి దొంగల్లా కాదు.. ఇంగ్లీష్ కథల్లో ఉండే రాబిన్ హుడ్ తరహా దొంగ అనమాట.

అంటే ఉన్నవాళ్ల జేబు కొట్టి.. లేనివాళ్ల కడుపు నింపే రకం దొంగ.

అతను దోచుకున్న సొమ్ముతో ఎంతో మందిని చదివించాడని కూడా చెప్పుకుంటారు.

అతను అందరిలాంటి దొంగ కాదు. ఒకానొక సమంయలో మద్రాసు జైలు నుంచి కూడా తప్పించుకున్నాడు.

1970ల సమయంలో పోలీసులను ఒక ఆట ఆడుకున్నాడు. 

 టైగర్ నాగేశ్వరరావు పేరు వినగానే కంగారు పడేంతలా ముప్పతిప్పలు పెట్టాడు. 

ఎందరికో అలా కడుపు నింపడం, చదువు చెప్పించడం వల్లే అతడిని ఇప్పటికీ ఆ ప్రాంతంలో గుర్తుచేసుకుంటారని చెప్తుంటారు.