దీపావళి సందడి మొదలై పోయింది. మార్కెట్లో అందరూ క్రాకర్స్ దుకాణాలకు క్యూ కడుతున్నారు.
సాధారణ టపాసుల స్థానంలో ఎలక్ట్రానిక్ క్రాకర్స్ లేదా ఈ- క్రాకర్స్ అంటారు వాటిని రూపొందిస్తున్నారు.
ఈ- క్రాకర్స్ లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో స్మోక్ లేకుండా రిమోట్ సాయంతో పేల్చే చిచ్చుబుడ్డులు(స్పార్క్స్).
వాటికి ఒక వైర్ కనెక్షన్ ఉంటుంది. దానికొక సర్క్యూట్ ఉంటుంది.
సర్క్యూట్ బ్యాటరీల సాయంతో పని చేస్తుంది. ఆ చిచ్చు బుడ్డిని స్టాండ్ లో పెట్టి సర్క్యూట్ కు కనెక్ట్ చేయాలి.
దానికి ఒక రిమోట్ ఉంటుంది. అంతా సిద్ధంగా ఉంది అనుకుంటే రిమోట్ లో బటన్ నొక్కగానే స్పార్క్స్ వస్తాయి.
ఇది దాదాపు 3 మీటర్ల ఎత్తు, 35 సెకన్ల పాటు నడుస్తుంది. ఆ సర్క్యూట్స్, రిమోట్ ను మూడేళ్ల వరకు ఉపయోగించుకోవచ్చు.
స్పార్క్స్ వచ్చేవి మాత్రం కొత్తవి తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఎక్కువ ఆడియో ఫంక్షన్స్, పెళ్లిళ్లలో ఎక్కువగా వాడుతున్నారు.
ఈ- క్రాకర్స్ లో మరో రకం.. సౌండ్ క్రాకర్స్. ఇవి సీమ టపాకాయలు మాదిరిగానే ఒక దండలాగా ఉంటాయి.
వాటికి ఒక వైర్ కనెక్షన్ ఉంటుంది. దానికి పవర్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.
వీటిని రిమోట్ సాయంతోనూ ఆపరేట్ చేయచ్చు. లేదంటే క్రాకర్స్ చివరన ఒక స్విచ్ ఉంటుంది.
బటన్ ప్రెస్ చేయగానే రియల్ టపాసుల మాదిరిగానే సౌండ్స్ వస్తాయి.
ఎలాంటి పర్యావరణ కాలుష్యానికి ఆస్కారం లేకుండా ఇలా కూడా దీపావళి చేసుకోవచ్చు అంటూ కొందరు అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.