“”
ప్రముఖ కమ్యునికేషన్ సంస్థ వాట్సప్ తన యూజర్లకు మంచి ఆఫర్ ప్రకటించింది.
వాట్సప్ యూపీఐ లావాదేవీలు చేసేందుకు వీలు కల్పించిన విషయం తెలిసిందే.
2020 నవంబర్ లో కొందరికి మాత్రమే పేమెంట్స్ ఆప్షన్ ఇచ్చిన కంపెనీ ఇప్పుడు అందరికీ ఆ అవకాశం కల్పిస్తోంది.
ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ప్రచారాలు కూడా బాగానే చేస్తోంది.
మరి ఆ క్యాష్ బ్యాక్ పొందాలంటే ఏం చేయాలి.. ఎలా ఆ క్యాష్ బ్యాక్ వస్తుందో చూద్దాం.
వాట్సప్ నుంచి మీకు రూ.255 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. పేమెంట్ కు సంబంధించిన ఎలాంటి లిమిట్ను పెట్టలేదు.
ఇంత అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ఇంత వస్తుందని పరిధి లేకుండా రూపాయి ట్రాన్స్ ఫర్ చేసినా.. రూ.51 క్యాష్ బ్యాక్ ఇస్తోంది వాట్సప్.
ప్రతి చెల్లింపునకు ఆ క్యాష్ బ్యాక్ రాదు. కేవలం యూజర్ మొదటి 5 చెల్లింపులకు మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ వస్తుంది.
అంటే ప్రతి యూజర్ కు వాట్సప్ నుంచి గరిష్టంగా రూ.255 క్యాష్ బ్యాక్ వస్తుంది.
ముందుగా మీ మొబైల్ లో అప్ డేటెడ్ వర్షన్ వాట్సప్ ఉందోలేదో చెక్ చేసుకోవాలి.
ప్లే స్టోర్ లో వాట్సప్ అని సెర్చ్ చేస్తే మీకు ఓపెన్ అని ఉంటే అప్ డేటెడ్ వర్షన్ ఉన్నట్లు.
అప్ డేట్ అని చూపిస్తుంటే అప్ డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సప్ చాట్ స్పేస్ లో మీకు ‘₹’ సింబంల్ వస్తుంది.
దానిపై క్లిక్ చేసి మీ బ్యాంకు ఖాతా వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది.
అన్ని యూపీఐ యాప్స్ ఎలా అయితే మీ ఖాతా వివరాలను తీసుకుంటాయో వాట్సప్ కూడా అలాగే మీ ఖాతా వివరాలను తీసుకుంటుంది.
అలా బ్యాంక్ ఖాతా అనుసంధానం చేశాక.. మీరు లావాదేవీలు చేయవచ్చు.
మీకు వచ్చే క్యాష్ బ్యాక్ కూడా నేరుగా మీరు అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తారు.