ఆర్ఆర్ఆర్.. ఈ ఒక్క సినిమా కోసం ఇండియన్ సినీ లోకం అంతా ఆత్రుతుగా ఎదురుచూస్తోంది.
తాజాగా RRR గ్లిమ్ప్స్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకోచ్చారు. మొత్తం 45 సెకండ్స్ నిడివి ఉన్న RRR గ్లిమ్ప్స్ పైకి చూడటానికి కేవలం కొన్ని షాట్స్ కలగలిపినట్టు ఉన్నా, దీనిలో చాలా కథ చెప్పేశారు జక్కన్న.
ఇప్పుడు మనం RRR గ్లిమ్ప్స్ లోతుగా ఉన్న ఆ అసలు కథ ఏమిటో తెలుసుకుందాం.
45 సెకండ్స్ నిడివి ఉన్న RRR గ్లిమ్ప్స్ మొదటి షాట్ లోనే రాజమౌళి కథలోని సోల్ పాయింట్ చెప్పేశాడు. అప్పటి బ్రిటీష్ పాలకుల పాలనకి ఇండియన్స్ ఎంతటి వ్యతిరేకంగా ఉద్యమించారో మొదటి షాట్ లో చూపించాడు జక్కన్న.
7వ సెకండ్ వద్ద ఓ పులి అడవిలో మనిషిని తరుముతున్న షాట్ ప్లే అయ్యింది. ఆ షాట్ లో పులిలా వేగంగా పరిగెడుతోంది ఎవరో కాదు.. మన కొమరం భీమ్.
13 సెకండ్ వద్ద పోలీస్ గెటప్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ ని రివీల్ చేశారు జక్కన్న. కానీ.., ఇక్కడ రామ్ చరణ్ క్లోజ్ షాట్ ని జాగ్రత్తగా గమనించారా? ఓ వ్యక్తి కాలిపోతున్న విజువల్.. చరణ్ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ దృశ్యాన్ని చూస్తూ చరణ్ బాధపడుతున్నాడు కూడా!
16 సెకండ్స్ వద్ద అజయ్ దేవగణ్ బ్రిటీష్ వారిని పిట్టలను కాల్చినట్టు కాల్చి పారేస్తున్న విజువల్ ని ప్లే చేశారు. అంటే.. ఈ గ్లిమ్ప్స్ లో మొదటి 18 సెకండ్స్ ముందు క్యారెక్టర్స్ ని పరిచయం చేశాడు జక్కన్న.
గుండె నిండా దమ్ము, దైర్యం ఉన్న రామరాజు బ్రిటీష్ వారి వద్ద పోలీస్ గా పని చేస్తూ.. వారు చేస్తున్న అన్యాయాలను అడ్డుకోవాలని కసిగా సమయం కోసం ఎదురు చూస్తుంటాడు.
ఫ్రీడమ్ ఫైటర్ గా పోరాడుతున్న అజయ్ దేవగణ్ కి.. దేశ భక్తి మెండుగా ఉన్న ఈ ఇద్దరు యువకులు వేరు వేరు పరిస్థితిల్లో తారస పడుతారు.
ఇదంతా కూడా కేవలం మొదటి 18 సెకండ్స్ లో రాజమౌళి చెప్పిన కథ.
19 వ సెకండ్ నుండి 28వ సెకండ్ వరకు కొమరం భీం, రామరాజు, బ్రిటిష్ వారితో చేసిన పోరాటాలను హైలెట్ చేశాడు రాజమౌళి.
ఇక మొత్తం టీజర్ లో హైలెట్ షాట్ అంటే 30వ సెకండ్ వద్ద ఉంది. ఈ షాట్ ని మీరు జాగ్రత్తగా గమనించినట్టు అయితే.. అక్కడ ఉరి కొయ్యలు వేలాడేసి ఉన్నారు.
లక్షల మంది జనం అక్కడ గుమిగూడి ఉన్నారు. ఆ విజువల్ అంతా చూస్తుంటే ఈ షాట్ ఆర్.ఆర్.ఆర్ క్లయిమ్యాక్స్ లోనిది అని అర్ధం అవుతుంది.
లక్షల మంది జనం అక్కడ గుమిగూడి ఉన్నారు. ఆ విజువల్ అంతా చూస్తుంటే ఈ షాట్ ఆర్.ఆర్.ఆర్ క్లయిమ్యాక్స్ లోనిది అని అర్ధం అవుతుంది.
ఇక్కడితో తాను చెప్పాలి అనుకున్న కథని ముగించిన జక్కన్న. మిగతా 15 క్షణాల సమయాన్ని ఫ్యాన్స్ కోసం ఎస్టాబ్లిష్ మింట్ షాట్స్ తో నింపేశాడు.