పునీత్ రాజ్ కుమార్ కి కార్డియాక్ అరెస్ట్ కారణంగానే ఆయన మరణించాడని వైద్యులు చెబుతున్నారు.

అసలు కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి? అది ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రధానంగా కార్డియాక్ అరెస్ట్ వచ్చే మనిషికి గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోతుంది. దీనినే కార్డియాక్ అరెస్ట్ అంటారు.

దీని కారణంగానే ఎంతో మంది మరణించారని వైద్యులు తెలియజేస్తున్నారు. 

అయితే దీని బారిన పడ్డ వారికి వెంటనే చికిత్స అందిస్తే ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలను కాపాడుకోవచ్చిన నిపుణులు సూచిస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో గుండె లయ తప్పడం వల్ల జఠరిక రక్తప్రరసరణ క్రమం తప్పుతుంది. ఒక్కోసారి రక్తప్రసరణ కూడా పూర్తిగా ఆగిపోతుంది.

సాధారణంగా వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ కారణంగానే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

పుట్టుకతోనే గుండె జబ్బులు, గుండె విద్యుత్ వ్యవస్థతో సమస్యలు తలెత్తినా, ధూమపానం చేసిన ఒకేచోట కూర్చుని పనిచేసేనా కార్డియాక్ అరెస్ట్ కు గురవుతారని నిపుణులు తెలియజేస్తున్నారు.

దీంతో పాటు అధిక రక్త పోటు, ఊబకాయం ,వంశపారంపర్య గుండె జబ్బులు ఉన్నవారికి కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులైన డాక్టర్ లు చెబుతున్నారు.

45 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్న పురుషులకు, 55 కంటే ఎక్కువ వయసున్న మహిళలకు, పొటాషియం/మెగ్నీషియం స్థాయిలు తక్కువ ఉ‍న్నవారిలో ఆకస్మిక మరణం సంభవించే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు.