సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా ఈ కోవలో ఉన్నారు. అలా మోసపోయామని తెలిసి జాగ్రత్త పడిన వాళ్లు కూడా లేకపోలేదు.
అలా ఎంతుకు జరిగింది? అందుకు గల కారణాలు ఏంటి? అలాంటి మోసపూరిత లావాదేవీలను ఎలా అరికట్టవచ్చు? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు, ఆర్బీఐ గైడ్లైన్స్ దృష్ట్యా ఇప్పుడు పాన్ కార్డు వినియోగం ఎంతో పెరిగిపోయింది. ఎక్కడ అంటే అక్కడ మీ పాన్ కార్డు వివరాలు ఇచ్చేస్తున్నారు.
కొన్నిసార్లు జిరాక్స్ షాప్లు, నెట్ సెంటర్లలోనూ మన పాన్ కార్డు వివరాలను అలాగే వదిలేస్తుంటాం. అలాంటి సందర్భాల్లోనే మోసాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
జిరాక్సు కాపీలు, పాన్ కార్డు హార్డ్ కాపీతోనే కాదు.. డిజిటల్ పరంగానూ పాన్ కార్డు దుర్వినియోగం జరుగుతోంది.
ఆన్లైన్ లావాదేవీల్లో సమర్పించిన పాన్ కార్డు వివరాలను సేకరించి నగల దుకాణఆల వాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు.
పెద్ద మొత్తంలో నగలు కొని పాన్ వివరాలను చెప్పేందుకు ఇష్టపడని వినియోగదారుల కోసం నగల కొట్లు వాళ్లు ఇలా చేస్తున్నారు. అప్పటికే సేకరించి పెట్టుకున్న పాన్ వివరాలను పొందు పరుస్తున్నారు.
దుర్వినియోగాన్ని ముందే కనుగొని దానిని అరికట్టాల్సి ఉంటుంది. అందుకు ఏడాదిలో కనీసం ఒక మూడుసార్లైనా ఐటీ రిటర్న్స్ ఫారం 26 ASను పరిశీలించుకోవాలి.
ఒకవేళ మీరు చేయని లావీదేవీలు అందులో ఉంటే.. వాటిని చేసింది మీరు కాదని నిరూపించుకోవాలి.
పాన్ కార్డు జిరాక్సులపై అవసరం లేకుండా సంతకం చేయడం మంచి పద్దతి కాదు. ఒకవేళ అలా చేసినా.. డేట్ మెన్షన్ చేయడం మంచిది.
నెట్ సెంటర్లలో మీ పాన్ కార్డు వివరాలను అసరం తీరాక డిలీట్ చేయండి.
ఇంట్లోని వాళ్లతో తప్పితే ఇంకెవరికీ మీ పాన్ కార్డు వివరాలు చెప్పకండి. బ్యాంకు ఖాతాను కూడా తరచూ చెక్ చేసుకోవడం మంచిది.