మారుతున్న కాలానికి అనుగుణంగా రకరకాల షాంపోలు, నూనేలు వంటివి వాడటం కూడా జుట్టు రాలటానికి కొన్ని కారణాలుగా చెప్పవచ్చిన వైద్యులు తెలియజేస్తున్నారు

అసలు జట్టు ఎందుకు రాలుతుంది. రాలటానికి గల కారణాలు, పాటించాల్సిన జాగ్రత్తలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జట్టు రాలటానికి అనేక కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. సరైన పోషక పదార్థాలు తీసుకోకపోవటం, జన్యు పరమైన లోపాలు వంటివి జట్టు రాలటానికి కారణాలుగా చెప్పవచ్చు.

ఇంకో రకంగా థైరాయిడ్ సమస్య, బాలింతలు వంటి వారికి కూడా జుట్టు రాలే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు.

 రెండు రోజులకు ఒకసారైన తల స్నానం చేయాలి, లేదంటే రోజుకు రెండు సార్లు చేసిన జుట్టు సంరక్షణలో బాగా ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు తలపై దుమ్ము, దూలి పడకుండా జాగ్రత్తలు పాటించాలి.

 ప్రధానంగా జుట్టు రాలుతున్న క్రమంలో మొదటగా డాక్టర్లను సంప్రదించటం, వారి సలహాలు సూచలను పాటించి వారిచ్చిన మందులు వాడటం ద్వారా కూడా కొంత మేరకు జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

 రోజుకు కనీసం 5 లీటర్ల మంచి నీటిని తీసుకోవటం ద్వారా జుట్టును అందంగా, జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.

జుట్టును స్ట్రైట్ చేయాలనుకున్నా, డ్రై చేయాలనుకున్నా ముందుగా జుట్టుకు బలాన్నిచ్చే సీరం కానీ క్రీమ్ లు కానీ వాడటం ఉత్తమం.

ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ మంచి సమతూల్యం కలిగిన ఆహారాన్ని తీసుకుంటే కనుక రాలిపోతున్న జుట్టును కొంత వరకు కాపాడుకోవచ్చిన చర్మ నిపుణులు తెలియజేస్తున్నారు.