ఐపీఎల్ 2022కు బీసీసీఐ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి రెండు కొత్త జట్లు కూడా ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే.

లక్నోను RPSG వెంచర్స్ లిమిటెడ్, అహ్మదాబాద్ ను CVC క్యాపిటల్ పార్టనర్స్ సొంతం చేసుకున్నాయి.

లక్నోను RPSG వెంచర్స్ లిమిటెడ్, అహ్మదాబాద్ ను CVC క్యాపిటల్ పార్టనర్స్ సొంతం చేసుకున్నాయి.

లక్నోలో ఈ ప్లేయర్లు కచ్చితంగా ఉండబోతున్నారు అని టాక్ మొదలైంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఐదుగురు స్టార్ ప్లేయర్లను లక్నో ఫ్రాంచైజ్ దక్కించుకోనుందని తెలుస్తోంది.

జట్టులో సొంత రాష్ట్రానికి చెందిన ప్లేయర్లు ఉంటే అభిమానుల్లో ప్రాంతీయాభిమానం కూడా పెరుగుతుందనే వాదన కూడా వినిపిస్తోంది.

ఇప్పటి వరకు సొంత టీమ్ లేక వేరే జట్లలో ఆడుతున్న ఉత్తరప్రదేశ్ ప్లేయర్లను లక్నో సొంతం చేసుకునే అవకాశం లేకపోలేదు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన పలువురు ప్లేయర్లు అన్ని ఫ్రాంచైజీల్లో ఆడుతున్న విషయం తెలిసిందే.

వారిలో సురేశ్ రైనా (చెన్నై సూపర్ కింగ్స్)

కుల్దీప్ యాదవ్ (కోల్కతా నైట్ రైడర్స్)

భువనేశ్వర్ కుమార్ (సన్ రైజర్స్ హైదరాబాద్)

ప్రియమ్ గార్గ్ (సన్ రైజర్స్ హైదరాబాద్)

అక్షదీప్ నాథ్(పంజాబ్ కింగ్స్)లను దక్కించుకునేందుకు ఇప్పటికే లక్నో టీమ్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

స్థానిక ఆటగాళ్లు టీమ్ లో ఉంటే అభిమానులను ఎక్కువగా ఆకట్టుకోవచ్చు అనేదే వీళ్ల ప్లాన్.

అది ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది మెగా ఆక్షన్ వరకు వేచి చూడాల్సిందే.