‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’లో పాకిస్తాన్ చరిత్రను తిరగరాసింది.
భారత్ పై విజయంతో ఎప్పటినుంచో వారి పేరిట ఉన్న చెత్త రికార్డును చెరిపేశారు.
చరిత్రను తిరగరాస్తామంటూ కామెంట్ చేసినట్లుగానే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ చేసి చూపించాడు.
ఇప్పుడు నెట్టింట అందరి వెతుకులాట అసలు బాబర్ ఆజమ్ ఎవరు? అతను కెరీర్ ఎప్పుడు మొదలైంది?
మీకోసం బాబర్ ఆజమ్ లైఫ్ స్టోరీ.
బాబర్ ఆజమ్.. పాకిస్తాన్ టాపార్డర్ బ్యాట్స్ మన్, ప్రపంచంలోనే ఉత్తమ ఆటగాడు.
అతను 1994 అక్టోబరు 15న లాహోర్ లో జన్మించాడు. అతని పూర్తి పేరు మహ్మద్ బాబర్ ఆజమ్.
2008 అండర్ 15 వరల్డ్ ఛాంపియన్ షిప్ తో బాబర్ ఆజమ్ కెరీర్ ప్రారంభమైంది.
అతను 2010, 2012 రెండుసార్లు అండర్ 19 వరల్డ్ కప్ ఆడాడు.
2016లో వెస్టిండీస్ పై యూఏఈలో వన్డేల్లో హ్యాటిక్ సెంచరీలు చేశాడు.
2016లో అత్యుత్తమ ప్రదర్శనతో జట్టులో మెయిన్ ఆటగాడిగా స్థిరపడ్డాడు.
2016లో వెస్టిండీస్ టూర్ లోనే టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు.
అప్పటి నుంచి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని పాకిస్తాన్ లోనే అత్యుత్తమ బ్యాట్స్ మన్ గా పేరు గడించాడు. ప్రపంచంలోని ఉత్తమ బ్యాట్స్ మన్ గానూ పేరు పొందాడు.
వన్డేల్లో వేగంగా 2000 పరుగులు సాధించిన రెండో బ్యాట్స్ మన్ గా బాబార్ ఆజమ్ నిలిచాడు.
టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన ప్లేయర్ గా బాబర్ ఆజమ్ నిలిచాడు.
2018 నుంచి అత్యుత్తమ బ్యాట్స్ మన్ గా బాబర్ ఆజమ్ కొనసాగుతున్నాడు.
పాకిస్తాన్ క్రికెట్ మూడు ఫార్మాట్ లకు బాబర్ ఆజమ్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ఆ దేశ క్రికెట్ అభిమానులు, మాజీలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మహ్మద్ బాబర్ ఆజమ్ తన కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.
‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’ సాధించడమే తమ లక్ష్యమని చెబుతున్న బాబర్ ఆజమ్ అది సాధిస్తాడో లేదో వేచిచూడాలి.