కొమ్మారెడ్డి పట్టాభి అక్టోబర్ 19న ‘బోషడికే’ అనే పదం వాడినప్పటి నుంచి ఆ పదానికి అర్థం తెలియక చాలామంది జుట్టు పీక్కుంటున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ బోసడికే అంటే పెద్ద భూతు అని, ఇలాంటి మాటలు ఎలా వాడతారు అంటూ ఆవేదన చెందుతూ పోస్ట్ చేశారు.
ఇదే సమయంలో బోసిడీకే పదానికి అర్థం ఏంటో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు వివరించారు.
వివాదానికి కారణమైన ఆ పదానికి అర్థమేంటో తెలుసుకునేందుకు నేను చాలా ప్రయత్నించాను. బోషిడికే అంటే బూతు పదం కాదు.
నేను గూగుల్లో సెర్చ్ చేయగా బోషిడికే అనే పదానికి చాలా స్పష్టమైన అర్థం దొరికింది ఉంది. ‘సర్.. మీరు బాగున్నారా’అనేది సంస్కృతంలో బోసడీకే దానికి అర్థం’ అని రఘురామ పేర్కొన్నారు.
ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఆ పదం తాను పలకలేనని.. ఆ పదానికి లంకారంలో అర్థం వస్తుందని చెప్పారు. ఇలాంటి మాట అన్నందుకే వైసీపీ సానుభూతి పరులు దాడులు చేసినట్టు ఆయన తెలియచేశారు.
ఇక టీడీపీ విప్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సైతం బోసడికే పదం తిట్టు కాదని .... ఇది గుజరాత్ లో ఒక ఊరి పేరని.. దానినే పట్టాభి చెప్పారని అన్నారు.
ప్రభుత్వాన్ని విమర్శించే సమయంలో పదే పదే బోసడికే అనే మాట వాడుతున్న పట్టాభిని అరెస్ట్ చేసి, రిమాండ్ కి తరలించారు.
ఒక్క మాట చుట్టూ ఇంత రాజకీయం జరుగుతుంటే.. ఆ మాటకి సరైన అర్ధం తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి? ఇందుకే బోసడికే అనే మాటకి అర్ధం కోసం గూగుల్ లో తెగ గాలించేస్తునారు.
నిజానికి కొత్త కొత్త అర్థాలను ప్రపంచానికి పరిచయం చేసే మీడియా కూడా ఈ మాటకి కరెక్ట్ మీనింగ్ చెప్పలేక మౌనంగా ఉండిపోవడం విశేషం.
సాధారణంగా గ్రామాల్లో, పల్లెటూళ్లలో ఇప్పటికీ పెద్దలు.. పిల్లలను ‘బోసడికే’ అని అంటుండటం రివాజు.
అర్ధం ఏదైనా.. ఊర్లలో ఇలాంటి తిట్లు మాటలు కామన్ గాని.., ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడే సమయంలో ఇలాంటి పదజాలం వాడటం ముమ్మాటికీ ఆమోదయోగ్యం కాదు
ఏదేమైనా ఈ ఒక్క మాట కారణంగా ఏపీలో రాజకీయం వేడెక్కడమే కాదు.., ఆ సెగ ఢిల్లీ పెద్దలను చేరడం, ట్విట్టర్ ట్రెండింగ్ ని ప్రభావితం చేయడం విశేషం.