ఆరు బంతులకు ఆరు పరుగులు సాధించిన క్రికెటర్లను చూశాం.

బ్రాడ్ బౌలింగ్ లో యవరాజ్ సింగ్ బాదిన 6*6 గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం.

కానీ ఒకే ఓవర్లో 8 సిక్సులు కొడితే! ఒక ఓవర్ లోనే ఒక టీమ్ 50 పరుగులు చేస్తే?

వినడానికే ఆశ్చర్యంగా.. నమ్మశక్యం కాకుండా ఉంది కదూ? కానీ అది నిజంగానే జరిగింది.

ఒక ఓవర్ లో 8 సిక్సులు బాదాడు ఒక బ్యాట్స్ మన్.

అది అంతర్జాతీయ క్రికెట్ కాదులెండి. ఆస్ట్రేలియా క్లబ్ క్రికెట్ లో జరిగింది ఈ ఫీట్.

ఆస్ట్రేలియాకు చెందిన శామ్ హ్యారిసన్ అనే ప్లేయర్ ఒకే ఓవర్ లో 8 సిక్సులు బాది ఔరా అనింపించాడు.

ఆ బౌలర్ ని తలుచుకుని నెటిజన్లు అంతా పాపం అంటున్నారు.

ఆస్ట్రేలియాలో సొరెంటో డన్ క్రైగ్ సీనియర్ క్లబ్- కింగ్ స్లే వుడ్ వేల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ నమ్మశక్యంకాని ఘటన జరిగింది.

పెర్త్ లో నార్త్ సుబుర్ బన్ కమ్యూనిటీ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది ఈ మ్యాచ్.

మొదట బ్యాటింగ్ కి దిగిన సొరెంటో డన్ క్రైగ్ టీమ్ 40 ఓవర్లలో 276 పరుగులు చేసింది. ఆ జట్టులో మొత్తం ఇద్దరు సెంచరీ బాదారు.

ఒక్క ఓవర్ లోనే 48 పరుగులు చేసిన శామ్ హ్యారిసన్ ఇన్నింగ్స్ లో మొత్తం 6 ఫోర్లు, 11 సిక్సులు బాదాడు.

ఒక్క ఓవర్ లో 50 పరుగులు ఇచ్చిన చెత్త రికార్డు బెన్నెట్ అనే బౌలర్ పేరిట నమోదైంది.

ఒక ఓవర్ లో 36 పరుగులు దాటి వచ్చిన ఘటనలు గతంలోనూ జరిగాయి.

ఐపీఎల్ లో క్రిస్ గేల్.. ప్రశాంత్ పరమేశ్వరన్ ఓవర్ లో 37 పరుగులు సాధించాడు.

గతేడాది హర్షల్ పటేల్ ఓవర్ లో జడేజా కూడా 37 పరుగులు సాధించాడు.

అయితే హిస్టరీలో ఇవే పరుగులు అనుకోవద్దు. ఇంతకన్నా ఇంకో చెత్త రికార్డు కూడా ఉంది.

న్యూజిలాండ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఒక్క ఓవర్ లో 77 పరుగులు సాధించారు. ఇప్పటికీ అత్యధిక పరుగులు వచ్చిన ఓవర్ గా అదే రికార్డుల్లో ఉంది.