విధ్య విశాఖ తాత వాళ్లది తణుకు. అయితే హైదరాబాద్ ప్రాంతానికి సమీపంలో ఘట్కేసర్కు వలస వచ్చారు. నాన్న వ్యవసాయం చేస్తారు. అమ్మ ఫిజికల్ డైరెక్టర్ టీచర్. వింధ్య తల్లికి క్రీడలంటే చాలా ఇష్టం.

క్రీడాకారిణిగా ఎదగాలనుకున్న ఆమెను ఇంట్లో వాళ్లు ప్రోత్సహించలేదు. ఆ కోరికతోనే వింధ్య క్రీడల్లో రాణించాలని ఆమె తల్లి కోరుకుంది. స్కూల్లో ఉండగా జిల్లాస్థాయి కబడ్డీ ప్లేయర్ వింధ్య.

కాలేజ్లో ఉన్నప్పుడు మోడలింగ్ చేసింది. లాక్మే ఫ్యాషన్ వీక్లో ర్యాంప్ కూడా చేసింది వింధ్య విశాఖ. భర్త విశాల్ కుమార్ ఎం.ఎన్.సీ. కంపెనీ పనిచేస్తున్నారు.

కొన్నాళ్లు న్యూస్ రీడర్గానూ చేసింది వింధ్య విశాఖ. డిగ్రీ పూర్తయ్యాక న్యూస్ రీడర్గా చేయడం మానేసింది. ఆ తర్వాత ఓ టీవీ ఛానల్లో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్కు యాంకర్గా చేసింది.

టీవీ షోలు, వినోద కార్యక్రమాలు ఎన్నో చేసింది. అలా చేస్తున్నప్పుడే ఒకరోజు ఫోన్ రావడంతో ముంబయి వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

క్రీడా యాంకర్గా మారిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. యాంకర్గా, క్రీడాకారులుగా వింధ్య విశాఖ ఎవరినైతే ఆరాధించిందో..

వారితోనే కలిసి పనిచేయడం, వారిని కలిసి మాట్లాడటం చేయడం సంతోషంగా ఉంటుందని చెప్తోంది.

మొదటి నుంచి వింధ్య విశాఖకు ఆమె తల్లి ఎంతో సపోర్ట్ చేసింది. పెళ్లయ్యాక ఆమె భర్త ద్వారా ఆ బలం మరింత పెరిగింది. పెళ్లైంది, పిల్లలు ఉన్నారు..

నీకు ఎందుకు ఈ పనులు అంటూ ఎప్పుడూ ఆమె భర్త తనను వెనక్కి లాగలేదు. నువ్వు చేయాలనుకుంటున్నావు చెయ్యి అంటూ ఎంతో ప్రోత్సహించేవాడని తెలిపింది.

పుట్టింటివారు, అత్తింటి వారు కలిసి ఇంత సపోర్ట్ చేయబట్టే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా అంటూ గర్వంగా చెప్పుకుంటుంది వింధ్య విశాఖ

దేశవ్యాప్తంగా మహిళా క్రీడా వ్యాఖతలు చాలా అరుదు. అలాంటి స్థానాన్ని తెలుగు వ్యాఖ్యతగా వింధ్య విశాఖ ఎంతో చక్కగా నిర్వహిస్తోంది.

ఎక్కడా ఆగిపోకుండా ముందుకు సాగి విజయం సాధించిన వింధ్య విశాఖ విజయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.