అసలు మంచు విష్ణు గెలుపుకి 

తోడ్పడిన 10 కారణాలు ఏవో 

ఇప్పుడు చూద్దాం.

మంచువారి అబ్బాయిగా ఇండస్ట్రీలో 

విష్ణుకు మంచి ఫాలోయింగ్ ఉంది.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వెన్నంటి

ఉండటం కూడా బాగా కలిసొచ్చింది.

విష్ణు విజయంలో వారసత్వం కీలకపాత్ర

పోషించింది. అంతే కాకుండా లోకల్ 

బాయ్ కావడం అదనంగా కలిసొచ్చిన

అంశం.

విష్ణుకు బాగా కలిసిచ్చిన అంశం..

కలుపుగోలుతనం. విష్ణు మొదటి నుంచి

అందరినీ కలుపుకుంటూ వెళ్లాడు. 

అందరినీ కలవడం, ఫోన్లు చేసి మట్లాడటం

విష్ణులో అందరినీ ఆకట్టుకున్న అంశాలు.

‘మా’ ఎన్నికలను మంచు విష్ణు చాలా

సీరియస్ గా తీసుకున్నాడు అనడానికి 

అతను చేసిన క్యాంపైన్ చూస్తే 

 అర్థమైపోతుంది. ఎన్నికల్లో విజయమే

లక్ష్యంగా ఎంతో కష్టపడి పనిచేశాడు 

మంచు విష్ణుని గత అధ్యక్షుడు నరేశ్

వెనుకుండి నడిపించడం కూడా ఎంతో

కలిసొచ్చిన అంశం. ప్రతి విషయంలో

నరేశ్ పక్కనే ఉండి విష్ణుకు దిశా నిర్దేశం

చేశాడు. నరేశ్.. తాను ముందే చెప్పిన 

విధంగా ఈ విజయంలో కృష్ణుడి పాత్ర

పోషించాడనే చెప్పాలి.

విష్ణు ముఖ్యంగా ఈ ఎన్నికల కోసం 

చెన్నై బ్యాచ్ ని రంగంలోకి దింపాడు.

అందరిని తీసికొచ్చాడు. పోస్టల్ బ్యాలెట్ 

కూడా ఎక్కువ ఓట్లు మనోడికి వచ్చాయి.

60 ఏళ్లు దాటిన వారు వేసిన పోస్టల్

బ్యాలెట్ ఓట్లలో ఎక్కువ విష్ణుకే వచ్చాయి.

సొంత ఖర్చుతో ‘మా’ భవనం నిర్మాణమే

ప్రధాన ఎజెండాగా విష్ణు ప్రచారం సాగింది.

మేనిఫెస్టోలోనూ ఇదే అంశాన్ని 

పొందపరిచాడు. ఇప్పటికే భవన 

నిర్మాణానికి స్థలాలు కూడా చూస్తున్నాని

ప్రకటించాడు. సొంత ఖర్చులతో 

భవనం అన్న వాగ్దానం బాగా పని చేసింది.

మంచు విష్ణకు ప్యానల్ సభ్యులు కూడా

మంచి బలం అనే చెప్పాలి. ప్యానల్ 

సభ్యులు గట్టివారు, మాట్లాడ గలిగిన

వారే. వారి ఫాలోయింగ్ కూడా

అధ్యక్షుడికి బాగా ప్లస్ అయ్యింది.

డిబేట్లు, ఇంటర్వూలు, కళాకారులను

కలవడం ఇలా విష్ణు ఎక్కువగా మీడియాలో

కనిపిస్తూ వచ్చాడు. కళాకారులు ఉండే

కృష్ణానగర్ లాంటి ప్రాంతాలకు కూడా విష్ణు

స్వయంగా వెళ్లి, వారిని కలిసి మాట్లాడాడు.

ఏదో విధంగా మీడియాలో కనిపించడం 

ఓటర్లపై ప్రభావం చూపిందనే చెప్పాలి.

మంచు విష్ణు మేనిఫెస్టోలో ఎన్నో 

వాగ్దానాలు చేశాడు. ఉచిత వైద్యం, ఉచిత

విద్య వంటి వాగ్దానాలే కాదు.. ఇండస్ట్రీలో

మహిళలకు సమస్యలు లేకుండా చూస్తానని

మాటిచ్చాడు. మహిళలకు అండగా ఉంటానని

వారికి హామీ ఇచ్చాడు. ఆ హామీ ఈ గెలుపులో

కీలకపాత్ర పోషించింది అనే టాక్ కూడా

వినిపిస్తోంది.

ప్రకాశ్ రాజ్ తో పోల్చుకుంటే వివాదాలు

లేకుండా క్లీన్ ఇమేజ్ ఉండటం కూడా 

కూడా మంచు విష్ణుకు బాగా కలిసొచ్చిన 

అంశం. మంచు విష్ణు ఇండస్ట్రీలో ఎవరితోనూ

గొడవలు పడింది కూడా లేదు. 

అంతేకాకుండా బాగా చదువుకున్న వాడు

ఇవి.. మంచు విష్ణు విజయానికి కారణమైన

కావడంతో మెంబర్స్ విష్ణుపై నమ్మకం 

నమ్మకం ఉంచారు. చూశారు కదా..?

10 అంశాలు. ఈ విషయంలో

మీ అభిప్రాయాలను కామెంట్స్ 

రూపంలో తెలియ చేయండి.