పీఎల్‌ నారాయణ అనగానే గుర్తు పట్టడం కష్టం. కానీ రుద్రవీణ, మయూరి చిత్రాల్లో హీరోయిన్‌ తండ్రి పాత్రలో నటించిన వ్యక్తి.

తెలుగు, తమిళ్‌లో సుమారు 300కు పైగా చిత్రాల్లో నటించాడు.

భర్త, లాయర్‌, రాజకీయ నాయకుడు, అమాయకమైన తండ్రి.. ఇలా పాత్ర ఏదైనా సరే.. దానికి ప్రాణం పోస్తాడు.

తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పీఎల్‌ నారాయణ వాస్తవానికి మళయాల కుటుంబానికి చెందని వ్యక్తి.

కానీ ఆయన పుట్టింది, పెరిగింది గుంటూరు, బాపట్లలో. విద్యాభ్యాసం కూడా అక్కడే జరిగింది.

చదువుకునే రోజుల్లోనే నాటకరంగం మీద ఆసక్తితో.. ఒంగోలు ప్రజానాట్యమండలిలో చేరాడు.

ఆసమయంలో ఆయన రాసిన కుక్క నాటకం జాతీయ స్థాయిలో అవార్డు సాధించింది.

ఈ నాటకం తర్వాత ఆయనకు సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి.

తెలుగు, తమిళ్‌లో 300కు పైగా చిత్రాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నారాయణ వారసులు ఎవరు సినిమాల్లోకి రాలేదా అంటే వచ్చారు.

టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా రాణించిన ఊహ.. నారాయణ మేనకోడలు.

ఆమె చిత్రం ద్వారార టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఊహ.. అసలు పేరు శివరంజిని.

తెలుగు కంటే ముందు తమిళంలో 20 సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది ఊహ.

తెలుగులో శ్రీకాంత్‌తో ఎక్కువ సినిమాల్లో నటించింది ఊహ.

అలా వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త.. ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది ఊహ. ప్రస్తుతం భర్త, బిడ్డలను చూసుకుంటుంది.