పెళ్లంటే ఇద్దరు మనుషులు, రెండు కుటుంబాలు మాత్రమే కాదు.. రెండు వేరు వేరు మనస్తత్వాలు.. భిన్న ఆలోచనలు కూడా.

మన జీవితంలో ఎంత అర్థం చేసుకునే మనిషి వచ్చినా.. ఎదుటి వ్యక్తితో ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి.

ఆ ఇబ్బందులు కొన్ని సార్లు సమస్యలుగా మారి నిత్యం వేధిస్తూ ఉంటాయి.

ఒక వేళ ఏ విషయంలోనూ ఇద్దరికీ పొత్తు కుదరకపోతే.. దిన దిన గండం నూరేళ్లు ఆయుష్షులా వైవాహిక జీవితం తయారవుతుంది.

నూటికి 70 శాతం వివాహాల్లో భర్త కారణంగానే ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి.

తమను అర్థం చేసుకోలేని భర్త కారణంగా చాలా మంది మహిళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మీ కారణంగా మీ  భాగస్వామి ఇబ్బంది పడుతున్నట్లు మీకు అనిపిస్తే.. ఈ పనులు చేసి వారిని సంతోష పెట్టండి.

ప్రతీ దాంట్లో ఆమె తప్పులు ఎంచటం మానేసి.. మీ భార్యలోని మంచి గుణాలను గుర్తుకు తెచ్చుకోండి.

అంతేకాదు! వాటితో మీకు జరిగిన, జరుగుతున్న మేలును కూడా గుర్తు తెచ్చుకోండి. వాటిని గుర్తు చేస్తూ భార్యను సంతోషపెట్టండి.

మీ భార్య మాత్రమే నిర్వహిస్తున్న బాధ్యతల్లో కనీసం ఒక్కదాన్నైనా మీ భుజాన వేసుకోండి.

కనీసం వారానికి ఓ సారైన భార్యను బయటకు తీసుకెళ్లండి.

మీ గురించి మీరు కూడా పట్టించుకోండి. చేసే ప్రతీ తప్పు నుంచి కొత్త విషయం నేర్చుకోండి. మళ్లీ ఆ తప్పును రిపీట్‌ కాకుండా చూసుకోండి.

భార్యతో మంచి కమ్యూనికేషన్‌ను బిల్డప్‌ చేసుకోండి.. చెప్పే ప్రతీ విషయంలోనూ క్లారిటీగా ఉండండి. వారు చెప్పే దాన్ని క్లారిటీగా వినండి.

వారు తమ సమస్యల గురించి చెప్పినపుడు శ్రద్ధగా వినండి. మీ చేతనైనంత సహాయం చేయండి. అది కూడా వారికి నచ్చితేనే.

డబ్బు సమస్యల గురించి ఇద్దరూ ఎక్కువగా చర్చించకపోవటం మంచింది. అవసరం అయితేనే తప్ప డబ్బు బంధం మధ్యలోకి రాకూడదు.

ఈ విషయాలు కేవలం భర్తలకే కాదు.. భార్యలకు కూడా వర్తిస్తాయి. మంచి వైవాహిక జీవితాన్ని కోరుకునే వారు దీన్ని తప్పక పాటించండి.