తాగే నీరు కూడా కలుషితం అవుతోంది. ఈ భూమ్మీద స్వచ్ఛమైన నీరు లభించని వారు ఎందరో ఉన్నారు.

కలుషిత నీరు తాగడం వల్ల డయేరియా, కలరా వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఈ క్రమంలో ప్రస్తుతం అందరూ మినరల్‌ వాటర్‌ తాగుతున్నారు.

దీనికోసం ప్రత్యేకంగా ఆర్వో వాటర్‌ ప్యూరిఫయర్‌ కొంటున్నారు.

ఆర్వో అంటే.. రివర్స్‌ ఆస్మాసిస్‌. నీటిలోని కలుషితాలను శుద్ధి చేసి.. స్వచ్ఛమైన తాగు నీటిని అందిస్తుంది.

ప్రస్తుతం చాలా మంది ఇళ్లల్లో ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్‌లను ఉపయోగిస్తున్నారు.

అయితే తాజాగా చేసిన అ‍ధ్యాయనాల్లో ఆర్వో  ప్యూరిఫైయర్‌ గురించి ఒక షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది.

ఆర్వో అనేది నీటి నుంచి కలుషితాలను శుభ్రపరచడమే కాక..

మనకు కావాల్సిన కొన్ని ముఖ్యమైన ఖనిజాలను, విటమిన్‌లను కూడా తొలగిస్తోంది అని తెలిసింది.

ఫలితంగా ఆర్వో వాటర్‌ను ఎక్కువగా తాగడం వల్ల బీ12 విటమిన్‌ లోపానికి దారి తీస్తుందని నివేదికలు చెబుతున్నాయి

విటమిన్ బీ12 రక్త ప్రసరణ వ్యవస్థ, నరాలు, రక్తం ఏర్పడటానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్.

ఈ విటమిన్‌ లోపిస్తే.. అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

శరీరంలో విటమిన్ బీ12 లోపం ఉన్నప్పుడు సమతుల్యతను కాపాడుకోవడంలో సమస్య ఏర్పడుతుంది.

అంతేకాక ఇది మెదడు ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

విటమిన్ బి12 శిశువు ఎదుగుదలకు చాలా అవసరం.

ఇక గర్భధారణ సమయంలో విటమిన్‌ బీ12 లోపం వల్ల  అనేక సమస్యలు వస్తాయి.

విటమిన్ బీ12 లోపం ప్రధానంగా శరీరంలో రక్తహీనత లోపానికి దారితీస్తుంది.

ఇది అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు మూలం కావచ్చు.

కనుక ఆర్వో వాటర్‌ వినియోగించే విషయంలో జాగ్రత్త అవసరం అంటున్నారు వైద్యులు