ఇలా ఉదయం పూట ఏదైనా టిఫిన్ తినకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా లేని పోని రోగాల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉదయం పూట టిఫిన్ తినకుండా ఉంటే వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి?
అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు ఎదురవుతాయట.
ఉదయం పూట టిఫిన్ చేయకపోవడంతో గుండె సంబంధితమైన వ్యాధులు వచ్చే ప్రమాదం లేకపోలేదు.
అంతేకాకుండా తలనొప్పి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఉదయం టిఫిన్ చేయకపోవడం వల్ల 27 శాతం గుండె పోటు వచ్చే అవకాశం ఉందని అనేక పరిశోధనల్లో వెల్లడైంది.
ఇక మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు ఉదయం పూట సమయానికి టిఫిన్ తినకపోవడం వల్ల ఎదుగుదలతో పాటు వారి ఏకాగ్రత మీద ప్రభావం చూపుతుందట.
సమాయానికి టిఫిన్ చేయకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ లేకపోలేదని తెలుస్తుంది.
ఇక నుంచైనా సమయానికి టిఫిన్ చేసి ఆరోగ్యంగా ఉండాలంటూ నిపుణులు సూచిస్తున్నారు.