పూనమ్ కౌర్ అనగానే సిక్కు అని అర్ధం అవుతుంది కదా? కానీ.. పూనమ్ కౌర్ పుట్టింది, పెరిగింది హైదరాబాద్ లోనే. కాకుంటే.. ఆమె తల్లిదండ్రులు పంజాబ్ నుండి ఇక్కడికి వలస వచ్చారు.
2006లో ఎస్వీ. కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన మాయాజాలం మూవీతో పూనమ్ కౌర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
పూనమ్ కౌర్ ఒక్క తెలుగులోనే కాదు.. కన్నడ, తమిళ్, హిందీ, మళయాలం చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.
హీరోయిన్ కు ఉండాల్సిన అందచందాలు, అభినయం ఉన్నా.. పూనమ్ కు మంచి కమర్షియల్ అవకాశాలు రాలేదని చెప్పాలి.
అప్పుడే కాదు.. ఆ తర్వాత కూడా పవన్ కల్యాణ్ విషయంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పూనమ్ ప్రస్తావన వస్తూనే ఉంది.
పొడుపు కథలు, చిక్కు ప్రశ్నలతో ట్వీట్లు చేయడం తప్ప.. విమర్శలపై పూనమ్ ఎప్పుడూ నేరుగా స్పందించింది లేదు.