జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అంతకంతకు హీటెక్కుతోంది.
నటుడు రచయిత పోసాని కృష్ణమురళి ఈ గొడవలోకి ఎంటర్ అయ్యాక మరింత రసవత్తరంగా మారింది. పోసాని పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు, విమర్శళు గుప్పిస్తూ.. ఓ నటిని ఇందులోకి లాగారు.
ఆ పంజాబీ అమ్మాయి ఎవరో తెలియకపోయినా.. పోసాని కృష్ణమురళీ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా పూనమ్ కౌర్ను ఉద్దేశించేనన్న కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పూనమ్ కౌర్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇండస్ట్రీలో గురు అంటే ఒక్కరే.. అది దాసరి నారాయణ రావు గారే. ఈ రోజు ఆయన ఉన్నట్టు ఆ దేవుడు ఓ సందేశాన్ని పంపించినట్టు అనిపించింది. మిస్ యూ.. అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది.
ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టాగ్రాం స్టోరీని కూడా పూనమ్ కౌర్ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఓ మహిళ మాట్లాడిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
ఈ వీడియోలో సదరు మహిళ ఇలా చెప్పుకొచ్చింది.
నేను రేప్కు గురయ్యాను..అందరూ నా శీలంపోయిందని అన్నారు.. నా సిగ్గు పోయిందని అన్నారు.
కానీ తప్పు చేసింది వాడు.. సిగ్గుపడాల్సింది వాడు.. నేను ఎందుకు సిగ్గుపడాలి?
ఆమె మాటలకు నటుడు ఆమిర్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు.
చాలా రోజుల క్రితం సోషల్ మీడియాలో వచ్చిన ఈ వీడియోను పూనమ్ కౌర్ ఇప్పుడు షేర్ చేయడంతో కొత్త అనుమానాలకు తావిస్తోంది.
ఇంతకీ పూనమ్ కౌర్ ఏం చేప్పాలనుకుంటుందో మాత్రం ఎవ్వరికి అర్ధం కావడం లేదు.
పూనమ్ కౌర్ కూడా ఈ విషయంలో పరోక్షంగానే స్పందిస్తుండటం విశేషం.