నేడు వ్యక్తిగత సమాచారం ఎంత దుర్వినియోగమవుతున్నాయో ఈ ఘటన ఓ ఉదాహరణ

గుర్తింపు కార్డులైనా ఆధార్, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డులతో పాటు మనం వినియోగించే యాప్‌ల్లో మనం పొందు పరిచే వివరాల ద్వారా డేటా భద్ర పరచబడుతోంది.  

ఇలా పొందుపరిచిన డేటాను కొంత మంది సైబర్ నేరగాళ్లు చోరీ చేస్తున్నారు.  దీంతో వ్యక్తిగత డేటా వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. 

ఈ డేటాను ఆధారంగా చేసుకుని బ్లాక్ మెయిల్ చేయడం లేదా వ్యాపారం చేసుకుంటున్నారు కేటుగాళ్లు. 

ఇటీవల ఓ వ్యక్తి  డేటా చోరీకి పాల్పడగా.. రూ. 66.9 కోట్ల మంది అంటే దేశ జనాభాలో సగం మంది జాబితా అతడి వద్ద ఉన్నట్లు తేలింది. ఈ ఘటన పెను సంచలనం సృష్టించింది.

ఇలా ఓ వ్యక్తి తన పాన్ కార్డు కారణంగా సమస్యలను ఎదుర్కొన్నాడు. ఈ ఘటన రాజస్థాన్ బిల్వారాలో జరిగింది.

కిషన్ గోపాల్ చపర్వాల్ అనే వికలాంగుడు ఓ స్టేషనరీ దుకాణాన్ని నడుపుకుని జీవనం సాగిస్తున్నాడు. 

గత నెల 28న రూ. 12. 23 కోట్లు కట్టాలంటూ ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసులు అందుకున్నాడు.

ఖంగుతిన్న కిషన్, అతడి కుటుంబ సభ్యులు..లబోదిబోమన్నారు. తర్వాత అతడు ఓ చార్టెడ్ అకౌంట్‌ను ఆశ్రయించాడు. 

అతడి పాన్ కార్డును దుర్వినియోగం అయ్యిందని తేలింది. ముంబయి, సూరత్‌లలో రెండు డైమండ్ షెల్ కంపెనీలు పెట్టి కోట్లల్లో బోగస్ లావాదేవీలు జరిపించడానికి అతని పాన్ కార్డును వాడుకున్నారని తేలింది. 

విషయం తెలిశాక..ఐటీ అధికారుల పంపిన నోటీస్‌కు తనకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తాను ఓ లోన్ తీసుకుని  దుకాణం నడుపుతన్నానని, రూ.8 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే సంపాదిస్తున్నానని తెలిపాడు

ఆ లోన్లు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నానని వాపోయారు. తన పాన్ కార్డు ఎవరు వాడారో తెలియదని పేర్కొన్నాడు.

ఈ విషయంలో తనకు ఉపశమనం కల్పించాలని పోలీసులను కోరాడు. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.