ఈ మధ్యకాలంలో చాలా మంది ఎక్కువగా ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. 

మారిన కాలానికి అనుగుణంగా వేర్ లెస్ బ్లూటుత్, ఇయర్ బడ్స్ అంటూ కొత్తగా వచ్చాయి.

చూడటానికి కూడా కాస్త స్టైలిష్ గా ఉండడంతో అందరూ కొనేస్తూ వాడుతున్నారు.

అయితే పాటలు వినడానికి ఎక్కువగా ఈ ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ వంటి రకకాల ఎలక్ట్రానిక్ వస్తువులు వాడడం అనేది చాలా ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.

ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడడం వల్ల వచ్చే అనార్థాలు ఏంటి? అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.  

మారిన కాలానికి అనుగుణంగా ఇయర్ ఫోన్స్, వేర్ లెస్ బ్లూటుత్, ఇయర్ బడ్స్ అంటూ చాలా రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులో ఉన్నాయి.

చూడటానికి కూడా కాస్త కొత్తగా, స్టైలిష్ గా ఉండడంతో అందరూ వాడేస్తూ లేనిపోని సమస్యల బారిన పడుతున్నారు.

ఎయిర్ ఫోన్స్ ఎక్కువగా వాడడం వల్ల అనేక రకాల చెవి సమస్యలు వచ్చే ప్రమాదం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.

 అవసరాన్ని బట్టి మాత్రమే ఇయర్ ఫోన్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

పాటలు వినడం, ఫోన్ కాల్స్ మాట్లాడే క్రమంలో 60 శాతం డేసిబెల్స్  కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.

అంతేకంటే ఎక్కువ డేసిబెల్స్ పెట్టుకుని పాటలు వింటే మాత్రం వినికిడి సమస్య రావచ్చని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఖచ్చితంగా వాడాల్సి వస్తే మాత్రం హెడ్ సెట్ వాడడం చాలా రకాలుగా బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.