ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు అనేక మంది ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నారు.

ముఖ్యంగా  అధిక బరువు, ఒబేసిటీ వంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు.

చాలా మందిలో అధిక బరువు  అనేది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేదిగా ఉంటుంది.

వ్యాయామాలు చేయడం బరువు తగ్గడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

వ్యాయామాలతో పాటు సమతుల్యమైన ఆహారం, కొన్ని రకాల పానీయాలు తాగడం మంచింది.

కొన్ని రకలా పానీయాలు తాగుతే నాజుకైన నడుమును పొందవచ్చని నిపుణులు అంటున్నారు.

ఈ క్రమంలో బరువు తగ్గేందుకు తీసుకోవలసిన ఆ డ్రింక్స్ ఏమిటో తెలుసుకుందాం..

గ్రీన్ టీ ఉండే యాంటీఆక్సిడెంట్లు, కెఫిన్ లు జీవక్రియను పెంచడంలో ఉపయోగపడతాయి.

అలానే గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు  బరువును తగ్గించడంలో  సహాయపడతాయి.

ప్రోటీన్ షేక్స్ తాగడం వల్ల మీరు కడుపు నిండిన అనుభూతిని పొందుతారు.

ఇవి మీ ఆకలిని తగ్గించడంలో, అదనపు క్యాలరీలు నియంత్రించడంలో తోడ్పడతాయి.

అలానే వెజిటబుల్ జ్యూస్ తాగడం వల్ల మీ డైట్‌లో న్యూట్రీషియన్స్,  ఫైబర్‌ని చేర్చినట్లు అవుతుంది.

కాఫీలో ఉండే కెఫీన్ ఇది మీ జీవక్రియను పెంచడంలో,  మీ ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.

అయినప్పటికీ, కాఫీని మితంగా,  చక్కెరలు లేదా క్రీమర్‌లు లేకుండా తీసుకోవడం ముఖ్యం.

నీరు పుష్కలంగా త్రాగడం వల్ల మీ జీవక్రియను పెంచడంతోపాటు మీ బరువు తగ్గడం సులభం అవుతుంది.