టాలీవుడ్ టాప్ స్టార్స్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు.
అశేష అభిమాన గణం పవర్ స్టార్ సొంతం. ఆయనకు యువతలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పవన్ మూవీ రిలీజ్ అయ్యిందంటే చాలు.. థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం కనిపిస్తుంది.
హిట్లు, ఫ్లాపులతో లేకుండా పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.
ఈమధ్య ఆయన స్థాయికి తగ్గ హిట్లు అందుకోలేదు. పవన్ నుంచి మెగా హిట్ కోసం అభిమానులతో పాటు ఆడియెన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్లో పవన్ కల్యాణ్ బిజీబిజీగా ఉన్నారు.
ఒకవైపు ‘వీరమల్లు’లో నటిస్తూనే, మరోవైపు మేనల్లుడు సాయి తేజ్ చిత్రంలోనూ సమాంతరంగా యాక్ట్ చేస్తున్నారు పవర్ స్టార్.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున చేతిలో ఉన్న ప్రాజెక్టులను త్వరగా ఫినిష్ చేయాలని పవన్ భావిస్తున్నారని తెలుస్తోంది.
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించనున్న మూవీలోనూ పవన్ నటించనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
పవన్-హరీష్ శంకర్ మూవీలో విలన్ రోల్ కోసం ఓ స్టార్ పొలిటీషియన్‌ను కలిశారు. ఆయన మరెవరో కాదు తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి.
పవన్‌కు విలన్‌గా నటించాల్సిందిగా మల్లారెడ్డిని హరీష్ శంకర్ అడిగారు. అయితే దీనికి మంత్రి ససేమిరా అన్నారట.
హరీష్ శంకర్ ఎంత ప్రయత్నించినా విలన్ పాత్రలో నటించేందుకు మల్లారెడ్డి ఒప్పుకోలేదు
ఈ విషయాన్ని స్వయంగా మల్లారెడ్డే ఓ సభలో బయటపెట్టారు. దీనికి సంబంధిచిన వీడియో వైరల్ అవుతోంది.
మరి.. పవన్ కల్యాణ్‌ను ఢీకొట్టే పాత్రలో మల్లారెడ్డి నటిస్తే బాగుండని మీరు అనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.