95వ అకాడమీ అవార్డు వేడుకలకు దీపికా పదుకొనె అవార్డు ప్రెసంటర్‌గా వెళ్లారు.
అకాడమీ అవార్డు వేడుకలో రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు.
ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాటను అక్కడికి వచ్చిన వారికి ఇంట్రడ్యూస్ చేశారు.
భారత్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న ఆమెకు ఈ వేడుక సందర్భంగా ఘోర అవమానం జరిగింది.
కొన్ని ప్రముఖ ఫొటో, మీడియా సంస్థలు దీపికా పేరుకు బదులు వేరే నటి పేరును వేశారు.
దీపికా పదుకొనె ఫొటోల కింద కెమెలా ఏవ్స్ అని రాసుకొచ్చారు.
ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో రచ్చకు దారి తీసింది.
నెటిజన్లు దీపికా పేరుకు బదులు కెమెలా పేరును రాయటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.
హాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న.. ఇన్‌స్టాగ్రామ్‌లో 72 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్‌ను గుర్తించలేకపోవటం బాధకరమంటున్నారు.
సదరు ఫొటొ, మీడియా సంస్థలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.