ఆమె హీరోయిన్. పలు సినిమాల్లో నటించి బాగానే పేరు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు ఓ పనితో అడ్డంగా దొరికిపోయింది.

సాధారణంగా హీరోయిన్ల గురించి చెప్పగానే డైట్ ఫాలో అవుతారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని అనుకుంటాం.

కొందరు మాత్రం అలా ఉండకపోవచ్చు. బయటకు బాగానే ఉన్నప్పటికీ డ్రింక్, స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉంటాయి.

ఇవి తప్పు అని చెప్పం గానీ వాటిని సీక్రెట్ గా ఉంచుకున్నంత వరకు బాగానే ఉంటుంది. ఒక్కసారి బయటకొస్తే మాత్రం రచ్చ అవుతుంది.

ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విషయంలోనూ దాదాపు అదే జరిగినట్లు తెలుస్తోంది. స్మోకింగ్ చేస్తూ ఈ పిల్ల కనిపించింది.

చూస్తే సన్నగా ఉండే అనన్య.. అసలు తింటుందా తినదా అనే డౌట్ వచ్చేలా కనిపిస్తుంది. గ్లామర్ ని మాత్రం బాగా మెంటైన్ చేస్తుంటుంది.

అనన్య కెరీర్ పరంగా చూసుకుంటే.. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ హిట్ కొట్టలేకపోయింది.

ఆ తర్వాత బాలీవుడ్ లోనే అనన్య పాండే మరో మూడు సినిమాలు చేసింది. కానీ ఫలితం లేకుండా పోయింది. అవన్నీ ఫెయిలయ్యాయి.

విజయ్ దేవరకొండ హీరోగా, పూరీ జగన్నాథ్ తీసిన 'లైగర్'లో అనన్యనే హీరోయిన్. దీంతో పాన్ ఇండియా వైడ్ హిట్ కొట్టాలనుకుంది.

కట్ చేస్తే.. ఈ సినిమాలో అనన్య యాక్టింగ్ పై ఘోరమైన ట్రోల్స్ వచ్చాయి. అలానే 'లైగర్' కూడా అట్టర్ ప్లాఫ్ అయింది.

అనన్య పాండే కజిన్ అలన్నా పాండే పెళ్లి వేడుక జరుగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా మెహందీ వేడుక జరిగింది.

ఈ టైంలో అందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటే.. ఓ సైడ్ కి నిల్చున్న అనన్య మాత్రం గుప్పుగుప్పుమని స్మోక్ చేస్తూ కనిపించింది.

అందుకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ అనన్యపై సెటైర్లు పేలుస్తున్నారు.

అనన్య పెదాల బ్యూటీ సీక్రెట్.. సిగరెట్ తాగడమా అంటూ పంచులు వేసి మరీ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.

సరే ఇదంతా పక్కనబెడితే అనన్య పాండే.. స్మోక్ చేయడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.