ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రక్షకు చిన్నప్పటినుంచి శ్రీకృష్ణుడంటే ఎంతో ఇష్టం.
ఆమె పెరిగి పెద్దయ్యే కొద్దీ ఆ ఇష్టం ప్రేమగా మారింది.
రక్ష శ్రీకృష్ణుడ్ని తన భర్తగా ఊహించుకోసాగింది.
జులై నెలలో తనకు శ్రీకృష్ణుడితో పెళ్లి జరిపించమని తల్లిదండ్రుల్ని కోరింది.
వారు కూతురి సంతోషం కోసం పెళ్లికి ఒప్పుకున్నారు.
తాజాగా, అత్యంత ఘనంగా ఆమెకు శ్రీకృష్ణుడి విగ్రహంతో పెళ్లి జరిపించారు.
ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. వధూవరులను ఆశీర్వదించారు.
శ్రీ కృష్ణుడు తరచుగా తన కల్లోకి వచ్చేవాడని.
ఓ రెండు సార్లు తన మెడలో దండకూడా వేశాడని రక్ష అంటోంది.
ఈ పెళ్లి వేడుక దేశ వ్యాప్తంగా వైరల్‌గా మారింది.