ప్రపంచవ్యాప్తంగా నోకియా కంపెనీకి ఉన్న ఆదరణ, వారి ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే.

కొన్నేళ్ల పాటు ఫీచర్‌ ఫోన్స్‌ మార్కెట్ లో ఏ సంస్థా కూడా నోకియాకి దరిదాపుల్లోకి కూడా రాలేదు.

ఆండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్లు రావడం మొదలైన తర్వాత నోకియా కంపెనీ తమ ప్రాభవాన్ని కోల్పోయింది.

ఆండ్రాయిడ్ ఫోన్ల దూకుడు ముందు నోకియా కంపెనీ నిలదొక్కుకోలేక పోయింది

తర్వాత స్మార్ట్ ఫోన్లు తయారు చేయడం ప్రారంభించినా కూడా ప్రభావం చూపలేకపోయింది.

ఇప్పుడిప్పుడే నోకియా కంపెనీ కూడా స్మార్ట్ ఫోన్ల తయారీ ప్రారంభించి పెద్ద కంపెనీలకు పోటీనిస్తోంది.

తాజాగా కేవలం రూ.5,999కే సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ లాంఛ్ చేసి అందరినీ ఆకట్టుకుంటోంది.

నోకియా కంపెనీ వాళ్లు తాజాగా సీ12 అనే మోడల్ స్మార్ట్ ఫోన్‌ ని భారత్ లో విడుదల చేశారు.

లుక్స్ పరంగా నోకియా సీ12 ఎంతో స్టైలిష్ గా ఉంది.

దీనిలో 6.3 హెచ్ డీ+ ఎల్ సీడీ డిస్ ప్లే ఉంది. 8+ 5 ఎంపీ కెమెరాలు ఉన్నాయి.

ఈ ఫోన్ లో నైట్ మోడ్- పోట్రెయిట్ మోడ్స్ ద్వారా కూడా మంచి ఫొటోలు తీసుకోవచ్చు.

ఇంక బ్యాటరీ విషయానికి వస్తే.. 3000 Mah రీమూవబుల్ బ్యాటరీ ఉంది.

ఈ నోకియా సీ12లో 2 జీబీ ర్యామ్ ఉంది.. మరో 2 జీబీ వర్చువల్ ర్యామ్ వాడుకోవచ్చు.

స్టోరేజ్ విషయానికి వస్తే.. 64 జీబీ స్టోరేజ్ వస్తోంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ తో పని చేస్తుంది.