95వ అకాడమీ అవార్డు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
మొత్తం 23 విభాగాల్లో అకాడమీ విజేతలను ప్రకటించింది.
హాంకాంగ్‌కు చెందిన ‘మిచెల్లీ యో’ ఉత్తమ నటిగా ఆస్కార్ గెలుచుకున్నారు.
‘ఎవరీ థింగ్.. ఎవిరీ వేర్ ఆల్ ఆట్ వన్స్’ సినిమాకు గానూ ఆమెకు ఈ అవార్డు వచ్చింది.
అయితే, మిచెల్లీ అందంపై కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
ముసలమ్మలా ఉంది ఆమెకు ఆస్కార్ ఏంటి అంటూ విమర్శలు చేస్తున్నారు.
మిచెల్లీ సాధారణ మనిషి కాదు.. నటనలో ఆమె ఎంతో సాధించారు.
1980లలో సినిమా కెరీర్‌ను మొదలుపెట్టిన ఆమె 50కిపైగా సినిమాలు చేశారు.
ఇప్పటి వరకు 30కి పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారు.
జాకీచాన్, జెట్‌లీలతో పోటీగా సినిమా చేశారు. ఇప్పటికీ చేస్తూ ఉన్నారు.
60 ఏళ్ల వయసులోనూ తన సత్తా చాటుతున్నారు.
ఆస్కార్ గెలుచుకున్న మొదటి ఆసియా మహిళగా చరిత్ర సృష్టించారు.