మార్చి నెల మొదలవడంతో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.
ఎండలు మండిపోవడంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి భయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
ఈ వేసవి ఎండలు నుంచి ఉపశమనం పొందేందుకు వాతావరణ శాఖ తీపి కబురును అందించింది.
మార్చి 16 నుంచి 20 వరకు ఏపీతో పాటు తెలంగాణలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఛత్తీస్ గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా ఈ ద్రోణి వెళ్లనుందని వాతావరణ శాఖ తెలిపింది.
దీని ప్రభావం కారణంగానే ఏపీతో పాటు తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
దేశంలోని తూర్పు ఆగ్నేయం దిశల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో 2,3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయట.
ఈ వర్ష సూచనతో అధిక ఉష్ణోగ్రతలు తగ్గి చల్లటి గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
దీంతో అధిక ఉష్ణోగ్రత నుంచి ఏపీ, తెలంగాణ ప్రజలు ఉపశమనం పొందనున్నారు.
మారిన వాతవరణ పరిస్థితుల నేపథ్యంలోనే రైతులు కూడా అలెర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.