ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు సాంగ్‌ ఆస్కార్‌కు ఎంపికవ్వడంపై తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఇక సీనియర్‌ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా ఆస్కార్‌ ప్రమోషన్‌ కోసం 80 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

దీనిపై మెగా, నందమూరి అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన వారు సైతం మండి పడుతున్నారు.

ఈవిషయంలో నాగబాబు-తమ్మారెడ్డికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

తాజాగా ఈ వివాదానికి సంబంధించి.. తమ్మారెడ్డిపై విమర్శలు చేస్తోన్న నాగబాబు.. కూల్‌గా కడిగి పరేశారు.

తెలుగు సినిమాకు ఆస్కార్‌ వస్తే.. గర్వించాల్సింది పోయి కుళ్లుకుంటారా.. విషం చిమ్ముతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

యంగ్‌స్టర్స్‌ని ప్రోత్సాహించాలి. ఈ పాటకు తారక్‌, రామ్‌ చరణ్‌ ఎలా డ్యాన్స్‌ చేశారో చూశారా అని ప్రశ్నించారు నాగబాబు.

వారిలా మనం డ్యాన్న్‌ చేయగలమా.. కాళ్లు కదపలేం.. మోకాళ్ల నొప్పులు. చేసే వాళ్లని ఎంకరేజ్‌ చేయాలి కదా అన్నారు.

పబ్లిసిటీ కోసం అందరూ పొగిడే అంశంలో విమర్శలు చేయడం మంచి పద్దతి కాదు.

మీరు ఏంటో.. మీ పొలిటికల్‌ బ్యాగ్రౌండ్‌ ఏంటో నాకు తెలుసు అన్నారు నాగబాబు.

గత కొన్నేళ్లుగా మీరు మాపై ఎన్నో విమర్శలు చేస్తున్నారు. పోనిలే అని పట్టించుకోవడం మానేశాను.

ఇక మీదట ఊరుకోను. మైక్‌ కనిపించగానే నీతి వ్యాఖ్యలు చెప్పడం మానుకొండి.

మీరు పెద్దవారు.. మీ వయసుకు తగ్గట్టు మాట్లాడండి.

నా వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి.. నేను కూడా అందుకు రెడీగా ఉన్నాను.

కానీ మీరు జాగ్రత్తగా మాట్లాడండి. వయసులో నా కంటే పెద్దవారు. నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి అని అంటూనే కూల్‌గా వార్నింగ్‌ ఇచ్చాడు నాగబాబు.