ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో కూడా స్పాట్ గోల్డ్ ఔన్సు ధర రూ. 1867 డాలర్ల వద్ద కొనసాగుతుంది.
ఇవాళ బంగారం, వెండి ధరలు పరిశీలిస్తే.. నిన్నటి మీద భారీగా పెరిగాయి.
హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 750 మేర పెరిగింది.
నిన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద ధర రూ. 51,400 ఉండగా.. ఇవాళ రూ. 52,150 ఉంది.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర ఇవాళ రూ. 56,890 ఉంది.
నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,070 ఉండగా ఇవాళ రూ. 820 మేర పెరిగింది.
గడిచిన 4 రోజుల్లో తగ్గుతూ వచ్చిన బంగారం ధర నిన్నటి నుంచి పెరుగుతుంది.
గడిచిన 4 రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 950 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 1020 వరకూ తగ్గింది.
అయితే ఇవాళ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.
22 క్యారెట్ల బంగారం నిన్న రూ. 500, ఇవాళ రూ. 750 పెరగగా.. 24 క్యారెట్ల బంగారం నిన్న రూ. 540, ఇవాళ రూ. 820 పెరిగాయి.
ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,890 ఉంది.
ఇక వెండి ధర కూడా బంగారం స్థాయిలోనే పెరిగింది.
ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 68,700 వద్ద కొనసాగుతోంది.
నిన్న అనగా మార్చి 10న కిలో వెండి ధర రూ. 67,300 ఉంది. ఇవాళ కిలో వద్ద రూ. 1400 పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర రూ. 20.53 డాలర్ల వద్ద కొనసాగుతోండగా స్పాట్ గోల్డ్ ఔన్సు ధర రూ. 1867.3 డాలర్ల వద్ద కొనసాగుతోంది.