సాధారణంగా మనం రాత్రిపూట నిద్రపోయిన తర్వాత ఏవేవో కలలు వస్తుంటాయి.

మరీ ముఖ్యంగా అప్పుడప్పుడు పెళ్లి, చావు కలలు కూడా వస్తుంటాయి. 

మన ఇంట్లో పెద్దలు.. పెళ్లి కలల వస్తే మంచిది కాదని, చావు కలలు వస్తే మాత్రం మనకు శుభపరిణామం అంటూ చెబుతుంటారు. 

అసలు కలలు ఎందుకు వస్తాయి? నిద్రలో చావు కలలు వస్తే ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. 

మెదడు, మెదడులో ఉండే అమిగ్డాలా, హిప్పోకాంపస్ వంటి భాగాల నుండి సంకేతాలను గ్రహిస్తుంది. వాటిని అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగానే మనకు కలలు వస్తాయని కొందరు మేధావులు చెబుతున్నారు.

మనకు నిద్రలో ఎన్నో రకాల కలలు వస్తుంటాయి. ఇకపోతే స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు రాబోయే రోజుల్లో అనర్థాలు, శుభాలు సూచిస్తాయని పండితులు చెబుతున్నారు. 

అయితే చావు కలలు రావడం వల్ల శభ సూచికమని చెబుతున్నారు. 

ఎవరైన అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు నిద్రలో చనిపోయిన మనిషి కనిపిస్తే వారికున్న రోగం నయమవుతుందని పండితులు చెబుతున్నారు.

ఇకపోతే వ్యాపారం చేసే వ్యక్తుల కలలోకి చనిపోయిన వ్యక్తులు వస్తే మీ వ్యాపారంలో లాభాలు వస్తాయని కొందరు పండితులు చెబుతున్నారు. 

అయితే ఎలాంటి వ్యక్తులకు అయిన చావు కలలు వస్తే అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

 చావు కలలు వస్తున్నాయని ఎవరూ భయందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని కూడా చెబుతున్నారు.