ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి ‘ఈపీఎఫ్ఓ’ గురుంచి ‘పీఎఫ్ ఖాతా’ గురుంచి తప్పక అవగాహన ఉంది ఉంటుంది.

ఉద్యోగి యొక్క నెలవారీ జీతంలో కొంత మొత్తాన్ని కట్ చేసి.. దానిని ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు జమ చేస్తుంటారు.

ఈ మొత్తం వారి వారి పీఎఫ్ ఖాతాలోనే జమ అవుతూ ఉంటుంది.

మీకు అత్యవసరమైన సందర్భాల్లో ఈ మొత్తాన్ని పాక్షికంగా ‘విత్ డ్రా’ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.

అయితే, చాలా మంది ఉద్యోగులకు పీఎఫ్ ఎందుకు కట్ చేస్తారు..? ఎంత మొత్తంలో కట్ అవుతుంది..?

బ్యాలన్స్ ఎలా చెక్ చేసుకోవాలి..? ఎలా విత్ డ్రా చేసుకోవాలి..? వంటి వివరాలు తెలియవు. 

ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

పీఎఫ్ ఖాతా అనేది ఉద్యోగికే అధిక ప్రయోజనం. దీని వల్ల బోలెడు ప్రయోజనాలు ఉంటాయి.

ముఖ్యంగా పీఎఫ్ ఖాతాదారుడు మరణించిన సమయంలో అర్హులైన నామినీలకు రూ.7 లక్షల వరకు బీమా అందిస్తారు.

అలాగే, ఖాతాదారుడు మరణించిన అనంతరం లబ్ధిదారులను బట్టి పెన్షన్ కూడా అందుతుంది. 

పీఎఫ్ కంట్రిబ్యూషన్ ఎంత మొత్తంలో కట్ చేస్తారంటే.. ఉద్యోగి యొక్క ప్రాథమిక జీతం, డియర్‌నెస్ అలవెన్స్‌లో 12% EPFకి జమ చేస్తారు.

ఇది ఆయా కంపెనీల నిభంధనలకు అనుగుణంగా ఉంటుంది.

UAN నెంబర్

పీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఉద్యోగికి UAN నెంబర్(12 అంకెల సంఖ్య) తప్పనిసరిగా ఉంటుంది. దీనినే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటారు.

ఉద్యోగి ఎన్ని చోట్ల పనిచేసినా, ఎన్ని కంపెనీలు మారినా యూఏఎన్ నెంబర్ ఒక్కటే ఉంటుంది.

ఉద్యోగి యొక్క నెలవారి జీతం వివరాలు తెలిపే పే స్లిప్ లోనూ యూఏఎన్ నెంబర్ నెంబర్ వివరాలు పొందపరిచి ఉంటాయి. ఒకసారి పరిశీలించండి.

ఈ నెంబర్ సాయంతో EPFO అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి పీఎఫ్ బ్యాలన్స్ తెలుకోవడం, విత్ డ్రా చేయడం చేయవచ్చు.

ఒక్క మిస్డ్ కాల్.. క్షణాల్లో పీఎఫ్ బ్యాలన్స్ వివరాలు

ఈ సేవలు పొందాలంటే.. ఖాతాదారుడు తప్పనిసరిగా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కలిగి ఉండాలి. మరియు UAN నెంబర్ యాక్టివేట్ చేసి ఉండాలి. అలా అయితేనే ఈ సేవలు పొందగలరు.

మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తో 9966044425 నెంబర్ కు కాల్ చేస్తే, రెండు రింగ్ ల తర్వాత కాల్ ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. అనంతరం పీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ వివరాలతో మెసేజ్ వస్తుంది.

అందులో UAN నంబర్, మీ పేరు, పుట్టిన తేదీ, ఆధార్ కార్డుకు సంబంధించి మొదటి రెండంకెలు, చివరి ఐదంకెలు.. పాన్‌కార్డుకు సంబంధించి తొలి రెండు లెటర్స్, చివరి రెండు లెటర్స్ కనిపిస్తాయి.

అలాగే, మీ పీఎఫ్ అకౌంట్ చివరి కాంట్రిబ్యూషన్ వివరాలు, మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు పొందుపరిచి ఉంటాయి.

UAN నెంబర్ తెలుసుకోవాలన్నా, ఆక్టివేట్ చేసుకోవాలన్నా ఈ లింక్ పై క్లిక్ చేసి పూర్తి చేయండి.