అందం విషయంలో ఎక్కువ మంది ముఖానికే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు.
ముఖం అందం మీద దృష్టి పెట్టి.. ఇతర శరీర భాగాల బ్యూటీపై పెద్దగా పట్టించుకోరు.
ముఖం తెల్లగా మారితే సరిపోదు. ఇతర శరీర భాగాలు కూడా అందంగా ఉంటేనే ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది.
ముఖం మీద దుమ్ము, ధూళి, మురికి, మృతకణాలు ఎలాగైతే పేరుకుపోతాయో.. అదే విధంగా పాదాల పైనా అవి పేరుకుపోతాయి.
వేసవిలో ఎండ దంచికొడుతుంది. ఎండ కారణంగా పాదాలు నల్లగా మారతాయి.
పాదాలను అందంగా మార్చుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి పాటిస్తే సరిపోతుంది.
ఒక గిన్నెలో అర చెక్క నిమ్మరసాన్ని తీసుకోవాలి. తర్వాత అందులో ఒక టీ స్పూన్ వంటసోడాను వేయాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని పాదాలకు రాసుకునే ముందు పాదాలు నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకోవాలి. తర్వాత 4 నిమిషాల పాటు సున్నితంగా మర్దన చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు పాదాల మీద అలాగే ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి.
ఆ తర్వాత పాదాలకు మాయిశ్చరైజింగ్ క్రీమ్ లేదా పెట్రోలియం జెల్లీని రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలపై ఉండే నలుపు, మృతకణాలు, బ్యాక్టీరియా తొలగిపోతుంది.
టమాట, నిమ్మరసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మం మీద ఉండే నలుపును తొలగించడంలో సాయపడతాయి.
ఈ మిశ్రమాన్ని పాదాలతో పాటు మెడ, చేతులు, మోచేతులు వంటి ఇతర శరీర భాగాల మీదా రాసుకోవచ్చు.