మన స్టార్ హీరోలు సినిమాలతో పాటు యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.
వీటితో పాటు కొత్త కొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు.
అదే మల్టీఫ్లెక్స్ బిజినెస్. ఇప్పటికే మహేష్ బాబు, ప్రభాస్ ఈ రంగంలో కొనసాగుతున్నారు
తాజాగా ఆ జాబితాలోకి రాబోతున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
అల్లు అర్జున్ ఏషియన్ (ఏఏఏ) పేరుతో మల్టీ ఫ్లెక్స్ నిర్మిస్తున్నారు.
హైదరాబాద్ నడిబొడ్డులో దీని నిర్మాణం జరుగుతోంది. ఏషియల్ సునీల్ నారంగ్ మరో పార్టనర్.
అమీర్ పేటలోని సత్యం థియేటర్స్ స్థలంలోనే దీన్ని నిర్మించనున్నారు.
మహేష్ బాబు ఏఎంబీ సినిమాకు ధీటుగా ఏఏఏ రూపొందిస్తున్నారు.
ఇందులో విశాలవంతమైన లాంజ్, అద్భుతమైన సీటింగ్ వ్యవస్థ ఉండనుంది.
అల్లు అర్జున తన వర్చువల్ ఇమేజ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
రెగ్యులర్ స్క్రీన్స్‌తో పాటు భారీ టీవీ స్క్రీన్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
దీని వల్ల ప్రొజెక్టర్ లేకపోయినా సినిమాను వేసుకోవచ్చు.
దాదాపుగా 100 కోట్ల రూపాయలకు అటు ఇటుగా ఖర్చు అవుతుందని ప్రచారం జరుగుతోంది.
మరో మూడు నెలల్లో AAA సినిమాస్ ప్రారంభం కానుంది