మన దగ్గర తులం బంగారం.. అది 22 క్యారెట్‌ అయినా.. 24 క్యారెట్‌ అయినా సరే.. 50 వేల పైచిలుకు ఉంది.

గత కొన్ని రోజులుగా మన దేశంలో బంగారం ధరలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి.

ఫిబ్రవరి నెల మొత్తం బంగారం ధర తగ్గుతూ వచ్చి మార్చి ప్రారంభం నుంచి మాత్రం పెరగసాగింది.

ఇక భారతీయులు ప్రతి ఏటా మనం వందల టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటాం.

ఇక 2022లో ఏకంగా 706 టన్నుల బంగారం దిగుమతి చేసుకంది ఇండియా.

మన దేశంలో బంగారానికి భారీగా డిమాండ్‌ ఉండటంతో భూటాన్‌ ఓ బంపరాఫర్‌ ప్రకటించింది.

భారతీయులకు ట్యాక్స్‌ ఫ్రీ గోల్డ్‌ అమ్మేందుకు ముందుకు వచ్చింది.

దీనిలో భాగంగా భూటాన్‌ వెళ్లే భారతీయులు అక్కడ 37 వేల రూపాయలకే తులం బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.

మరి భూటాన్‌ ఈ ఆఫర్‌ ఎందుకు ప్రకటించింది అంటే.. పర్యాటకులను ఆకర్శించి.. టూరిజం ఆదాయాన్ని పెంచుకోవడానికి.

ఈ ట్యాక్స్ ఫ్రీ గోల్డ్ కొనుగోలు చేసేందుకు అనుమతిస్తూ ఫిబ్రవరి 21, 2023 న భూటాన్‌ నిర్ణయం తీసుకుంది.

ఫిబ్రవరి 21న భూటాన్‌ రాజు జన్మదినం మాత్రమే కాకా కొత్త ఏడాది కూడా అదే రోజున ప్రారంభం అవుతుంది.

ప్రస్తుతం మన దేశంలో 24 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాములకు రూ.55,600పైన ఉంది.

కానీ భూటాన్‌‍లో భూటనీస్ ఎన్‌గూల్ట్రమ్ (బీటీఎన్) ప్రకారం 10 గ్రాములకు బీటీఎన్ 37,588.49గా ఉంది.

ఒక భూటాన్ కరెన్సీ బీటీఎన్ దాదాపు ఇండియన్‌ రూపాయితో సమానంగా ఉంటుంది.

కనుక భారతీయులు ఈ ఆఫర్‌తో 10 గ్రాముల బంగారం కేవలం రూ.37,588కే కొనుగోలు చేయొచ్చు.

ట్యాక్స్‌ ఫ్రీ గోల్డ్‌ కొనుగోలు చేయాలంటే భారతీయులు సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ ఫీ (ఎస్‌డీఎఫ్) రూ.1,200 నుంచి రూ.1,800 చెల్లిస్తే సరిపోతుంది.

అలాగే భూటాన్ ప్రభుత్వం గుర్తింపు పొందిన టూరిస్ట్ సర్టిఫైడ్ హోటల్‌లో ఒక రాత్రి ఉండాల్సి ఉంటుంది.

ఈ బంగారాన్ని డ్యూటీ ఫ్రీ ఔట్‌లెట్స్‌లో కొనుగోలు చేయొచ్చు. వీటిని భూటాన్‌ ఆర్థిక శాఖ నిర్వహిస్తోంది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ విభాగం నిబంధనల ప్రకారం ఒక భారతీయుడు భూటాన్‌ నుంచి రూ.50 వేల విలువైన బంగారం తీసుకురావచ్చు.

ఇండియన్‌ మహిళ రూ.1 లక్ష వరకు విలువైన గోల్డ్ తీసుకురావచ్చు.

 అంతకు మించి తీసుకువస్తే కస్టమ్స్ సుంకాలు చెల్లించాల్సి వస్తుంది.