సినిమాలు లేదా డైరెక్టర్స్ వివాదాల్లో చిక్కుకోవడం అంతం లేని టాపిక్. ఇది ఎప్పుడూ ఉండేదే.

అయితే సినిమా రిలీజ్ సందర్భంగా అవి ఎక్కువగా కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటూ ఉంటాయి.

కానీ ఇప్పుడు జరిగింది మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్. తాజాగానే ఈ ఇష్యూ జరిగింది.

ఓ ఇంటర్వ్యూ సందర్భంగా 'కేరాఫ్ కంచరపాలెం' డైరెక్టర్ వెంకటేష్ మహా.. KGF హీరో పాత్ర తీరు, స్టోరీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

KGF హీరో.. 'నీచ్ కమీన్ కుత్తే' అని డైరెక్టర్ వెంకటేష్ మహా కాస్త ర్యాష్ గానే మాట్లాడేశాడు. ఇది చాలామందికి నచ్చలేదు. 

అదే టైంలో డైరెక్టర్ వెంకటేష్ పక్కనే ఉన్న నందినిరెడ్డి, ఇంద్రగంటి మోహనకృష్ణ, వివేక్ ఆత్రేయ లాంటి వాళ్లు నవ్వుతూ కనిపించారు. 

ఈ గొడవ కాస్త పెద్దదయ్యేసరికి మిగతా ముగ్గురు డైరెక్టర్స్ కూడా సారీ చెప్పేశారు. వెంకటేష్ మహా కూడా క్షమాపణలు చెప్పాలని కాస్త గట్టిగా వినిపించింది

ఇప్పుడు డైరెక్టర్ వెంకటేష్ కూడా 'కేజీఎఫ్' ఇష్యూపై ఓ మెట్టు దిగి సారీ చెప్పాడు. అదే టైంలో ఓ విషయంలో మాత్రం అస్సలు తగ్గనని చెప్పుకొచ్చాడు. 

'రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో, ఒకానొక సందర్భంలో నేను వ్యక్తపరిచిన ఓపెనియన్ చాలామందికి అభ్యంతరకరంగా అనిపించిందని తెలిసింది'

'అయితే నా మాటల్ని మాత్రం వెనక్కి తీసుకోవట్లేదు. కానీ ఆ టైంలో నేను వాడిన భాష బహుశా సరైనది కాదు. నేనే ఒప్పుకుంటాను'

'ఓ డైరెక్టర్ గా నేను అలాంటి భాష ఉపయోగించి ఉండకూడదు. అది చాలామంది మరీ ముఖ్యంగా అభిమానులకు అభ్యంతరకరంగా అనిపించింది'

'నేను వాడిన భాష విషయంలో మాత్రమే సారీ చెబుతున్నాను. నా ఒపీనియన్ అయితే మారదు' అని వెంకటేష్ మహా చెప్పుకొచ్చాడు.

'ఓ ఇండస్ట్రీనో, ఓ వ్యక్తినో కించపరిచే ఉద్దేశంతో అన్న మాటలు కావవి. అన్ని సినిమాలను ఆదరించాలనేది నా అభిప్రాయం' అని అన్నాడు.

పైన చెప్పిన మొత్తం విషయాన్ని వీడియోగా తీసి తన సోషల్ మీడియాలో అకౌంట్స్ లో పోస్ట్ చేశాడు. ఇది కాస్త ఇప్పుడు వైరల్ అయిపోయింది.

మరి డైరెక్టర్ వెంకటేష్ మహా- కేజీఎఫ్ కాంట్రవర్సీపై ఎవరిది రాంగ్? ఎవరిది రైట్? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.