సోషల్ మీడియా ద్వారా ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించిన వారిలో భుబన్ బద్యాకర్ ఒకరు.
పశ్చిమ బెంగాల్ భీర్‌భూం జిల్లాలోని కురల్జూరి గ్రామం భుబన్ స్వగ్రామం.
సైకిల్‌పై శనగలు అమ్ముకుంటూ కచ్చా బాదాం అంటూ భుబన్ పాడిన పాట ఆయన్ను రాత్రికి రాత్రే స్టార్‌ను చేసేసింది.
కచ్చా బాదాం సాంగ్ ద్వారా వచ్చిన గుర్తింపుతో బుల్లితెరపై కొన్ని కార్యక్రమాల్లో గెస్ట్‌గా హాజరై పాటలు పాడాడు భుబన్.
పాటలు పాడుతూ, ప్రదర్శనలు ఇస్తూ బాగానే సంపాదించాడు భుబన్. అయితే ఆ డబ్బులను, క్రేజ్‌ను నిలబెట్టుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు.
వచ్చిన డబ్బులను వచ్చినట్లే ఖర్చు చేసేశాడు భుబన్. ఈ క్రమంలో కొత్త కారు కొని యాక్సిడెంట్ అయి ఆస్పత్రి పాలయ్యాడు.
తన అనుకున్న వారే భుబన్ను మోసం చేశారు. అతడి దగ్గర నుంచి చాలా డబ్బును గ్రామస్తులు కాజేశారు.
అడిగిన వారికి అప్పులు ఇస్తూ మోసపోయాడు భుబన్. చివరికి జనాల వేధింపులు తట్టుకోలేక 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరే ఊరికి షిఫ్ట్ అయ్యాడు.
కొన్నాళ్లు స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన భుబన్.. ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నాడు.
కాపీ రైట్ ఇష్యూ వల్ల ఆఖరుకు తనకు పేరు తీసుకొచ్చిన కచ్చా బాదాం పాటను కూడా పాడలేని దయనీయ స్థితిని భుబన్ ఎదుర్కొంటున్నాడు.
పల్లీలు, శనగలు అమ్మగా వచ్చిన డబ్బులు కుటుంబ పోషణకు సరిపోవడం లేదని.. ఇంటి అద్దె ఎలా చెల్లించాలంటూ వాపోయాడు.
చదువుకోకపోవడం, లోక జ్ఞానం లేకపోవడంతో చాలా మంది తనను మోసం చేశారని అన్నాడు.
ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్ సొసైటీ లిమిటెడ్ సంస్థ తనను మోసం చేసిందని భువన్ చెప్పాడు.
చదువురాని తనతో కాపీరైట్‌ను విక్రయించిన పేపర్ మీద సంతకం చేయించుకున్నారని ఆరోపించాడు.