ఈ రోజుల్లో చాయ్ ని చాలా మంది తాగుతున్నారు.
ఐటీ ఉద్యోగుల నుంచి ఇంట్లో ముసలవ్వల వరకూ అందరికీ చాయ్ తాగే అలవాటు ఉంటుంది.
ఇదిలా ఉంటే చాలా మంది మాత్రం.. ఉదయం పూట చాయ్ తాగేటప్పుడు అందులో బిస్కెట్స్ కలిపి తీసుకుంటుంటారు.
అలా తీసుకోవడం వల్ల మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే అంటున్నారు ప్రముఖ వైద్య నిపుణులు.
అసలు చాయ్, బాస్కెట్ కలిపి తీసుకోవడం కలిగే నష్టాలు ఏంటి?
ఆరోగ్య నిపుణులు ఏం చెబుతన్నారో తెలియాలంటే తప్పకుండా ఈ స్టోరీ చదవాల్సిందే.
చాయ్ ని రోజుకి రెండు సార్ల కంటే ఎక్కువగా తీసుకుంటే చాలా అంత మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అయితే చాలా మంది చాయ్ తాగేటప్పుడు అందులో బిస్కెట్స్ వేసుకుని తీసుకుంటున్నారు.
అలా చాయ్ లో బిస్కెట్స్ కలిసి తీసుకోవడం వల్ల చాలా రకాల నష్టాలు ఉన్నాయట.
బిస్కెట్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా రక్తంలో ఉండే చెడు కొలస్ట్రాల్, బ్యాడ్ కలస్ట్రాల్, ఎల్డీఎల్ కొలస్ట్రాల్ పెరిగి గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గుతుంది.
తద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతే కాకుండా పెద్ద మెదడుకు రక్తసరఫరా తగ్గి పక్షవాతం కూడా వస్తుందట.
ఇదే కాకుండా ఆకలిని చంపి అజీర్థి వంటి సమస్యలు కూడా వస్తాయట.
నోట్: పైన తెలిపిన చిట్కాలు పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్ల, నిపుణుల సలహాలు తీసుకోండి.