బయటకు వెళ్లేటప్పుడు వైఫై స్విచ్ ఎందుకు ఆపాలంటే..?
ఇంకా కొన్ని రోజులు పోతే ఇంటర్నెట్ లేకపోతే మనిషి జీవితమే లేదని పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
పట్టణాలు, నగరాలు, మెట్రో సిటీలలో ఇంట్లో వైఫే ఉండటం సహజంగా మారిపోయింది.
ఇంట్లో స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ గ్యాడ్జెట్ల కోసం వైఫైని వాడుతున్నారు.
అయితే చాలామంది ఈ వైఫై విషయం ఒక తప్పు చేస్తుంటారు. బయటకు వెళ్లే సమయంలో వైఫై పవర్ ఆఫ్ చేయరు.
అలా చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందో చూద్దాం.
ఈ వైఫైని అందరూ వాడతారు కానీ, దానిని ఎలా వాడాలో చాలా మందికి తెలియకపోవచ్చు.
వైఫైకి సెక్యూర్డ్ పాస్ వర్డ్ పెట్టుకోవడం, మన వైఫై నెట్ వర్క్ మరెవరన్నా వాడుతున్నారేమో చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోరు.
మరీ ముఖ్యంగా బయటకి, ఊర్లకు వెళ్లే సమయంలో వైఫై పవర్ సప్లై ఆఫ్ చేయరు.
మీరు వైఫై నెట్ వర్క్ ని స్విచ్ ఆఫ్ చేయకుండా వెళ్లడం కారణంగా.. మీ డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉంది.
అంటే ఈ మధ్య వచ్చిన కొత్త టెక్నాలజీతో మీ వైఫై పాస్ వర్డ్ క్రాక్ చేయడం పెద్ద సమస్య కాదు.
అలాగే మీ వైఫై నెట్ వర్క్ ద్వారా ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తే.. నెట్ వర్క్ అడ్రస్ ఆధారంగా మీరే బాధ్యులు అవుతారు.
వేరే వాళ్లు మీ డేటాని వాడుకోవడం వల్ల మీ మంథ్లీ ప్లాన్ లో ఉండే డేటా త్వరగా అయిపోయే అవకాశం ఉంది.
అంతేకాకుండా ఎక్కువ రోజులు ఊరికే వెళ్లే సందర్భంలో కచ్చితంగా వైఫై ఆపేయండి.
అలా చేయడం వల్ల మీకు విద్యుత్ ఛార్జెస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది.