సాధారణంగా ఎవరైన పాము కనిపిస్తే భయంతో అక్కడి నుంచి పారిపోతారు.
మరికొందరు పాము కనిపిస్తే...వెంటబడి దాడి చేసి చంపేస్తుంటారు.
ఇక గాయాలతో ఉన్న పామును చూస్తే మాత్రం ఇంకా దారుణంగా చంపేస్తుంటారు.
అయితే కొందరు మాత్రం మూగ ప్రాణులను కాపాడుతుంటారు.
ఆ కోవాకు చెందిన వ్యక్తే విశాఖపట్నంలోని గాజువాకు చెందిన వెటర్నరీ వైద్యుడు సునీల్.
గాజువాక ప్రాంతంలోనే ఓ భవనంపై నుంచి పడిపోయిన పామును స్థానికులు గమనించారు.
భవనంపై నుంచి జారీ పడిపోవడంతో ఆ పాముకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే స్పందించిన స్థానికులు పాము గురించి స్నేక్ క్యాచర్ సమాచారం అందించారు.
పాములను పట్టే వ్యక్తి అక్కడికి చేరుకుని గాయలతో బాధపడుతున్న ఆ పామును పరిశీలీంచారు.
పాముకు తీవ్రగాయాలు ఉండటం గమనించిన అతడు తనకు తెలిసిన వైద్యం చేశారు.
అనంతరం మల్కాపురం పశువుల ఆస్పత్రి వైద్యుడు సునీల్ వద్దకు పామును తీసుకెళ్లారు.
ఆ పామును పరిస్థితిని గమనించిన వైద్యుడు.. చికిత్స అందించాలని భావించారు.
దాదాపు గంట పాటు సర్జరీ చేసి డాక్టర్ సునీల్ పాము తలభాగంలో కుట్లు వేశారు.
వివిధ రకాల మందులు పాముకు వేసి కాసేపు విశ్రాంతి ఇచ్చారు.
ప్రస్తుతం పాము ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు సునీల్ తెలిపారు.
నాగపాముకు సర్జరీ చేయడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆసక్తికరంగా మారింది.