చాట్ జీపీటీ.. ఈ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఓపెన్ ఏఐ చాట్ బాట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ప్రస్తుతం టెక్ రంగంలో ఎక్కడ చూసినా ఈ చాట్ బాట్ గురించే చర్చ జరుగుతోంది.
విమర్శలు పక్కన పెట్టి ఈ చాట్ జీపీటీకి యూజర్లు పాజిటివ్ రివ్యూలు ఇవ్వడం ప్రారంభించారు.
ఇప్పటికే ఈ చాట్ జీపీటీ సాయంతో ఎంతోమంది కంటెంట్ క్రియేటర్లు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు.
తాజాగా ఈ చాట్ జీపీటీ సాయంతో ఓ వ్యక్తికి ఏకంగా రూ.90 లక్షలు అందుకున్నాడు.
చాట్ జీపీటీ సాయంతో ఇంక రావు అనుకున్న రూ.90 లక్షలను తిరిగి పొందాడు.
చాట్ జీపీటీ రాసిన ఒకే ఒక్క ఈమెయిల్ తో.. ఆ వ్యక్తికి రావాల్సిన రూ.90 లక్షలు అందుకున్నాడు.
ఆ విషయాన్ని అతనే స్వయంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.
గ్రెగ్ ఐసన్ బర్గ్ అనే వ్యక్తి చాట్ జీపీటీ తనకు ఏ విధంగా సహాయం చేసింది అనే విషయాన్ని వెల్లడించాడు.
ఓ మల్టీ బిలియనీర్ కంపెనీ నుంచి అతనికి 1,09,500 డాలర్లు రావాల్సి ఉంది.
వాళ్లు అతనికి ఆ డబ్బు చెల్లించేందుకు సుముఖంగా ఉన్నట్లు అనిపించలేదు.
ఇంక న్యాయ పోరాటానికి దిగాల్సిందే అంటూ గ్రెగ్ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
అయితే గ్రెగ్ ఐసన్ బర్గ్ కు ఒక ఐడియా వచ్చింది. చాట్ జీపీటీని ఎందుకు సలహా అడగకూడదు అనుకున్నాడు.
చాట్ జీపీటీని ఒక ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ఉద్యోగిగా అనుకుని.. 5 నెలల మొండి బకాయి వసూలు చేసేందుకు ఈమెయిల్ రాయమన్నాడు.
చాట్ జీపీటీ రాసిన మెయిల్ కొన్ని మార్పులు చేసి ఆ కంపెనీకి పంపాడు. డబ్బు చెల్లిస్తామంటూ ఆ కంపెనీ రిప్లై ఇచ్చింది.