ఒకప్పుడు గుండె జబ్బులు 50, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు వచ్చేవి.
కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికీ వస్తున్నాయి.
40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారు, చిన్న పిల్లలు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు.
వెల్లుల్లి, నిమ్మకాయల్లో కొలెస్ట్రాల్ కరిగించే లక్షణాలు ఉంటాయి.
నిమ్మకాయ, వెల్లుల్లి రసం కలిపి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
వెల్లుల్లి ఫంగల్ ఇన్ఫెక్షన్ చికిత్సలో ఉపయోగపడుతుంది.
వెల్లుల్లిని బాగా చిన్న ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో వేసి.. నిమ్మకాయ రసాన్ని కలపాలి.
వెల్లుల్లి, నిమ్మరసంలో అంత త్వరగా కలవాడు. అందుకే ఈ మిశ్రమం కలవడానికి 25 రోజులు తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి.
వెల్లుల్లి నిమ్మకాయతో కలవడానికి ప్రతిరోజూ గిన్నెను కదిలించాలి. బాగా కలిసిన తర్వాత ఈ మిశ్రమాన్ని టిఫిన్ కి 30 నిమిషాల ముందు ఒక చెంచాడు తీసుకోవాలి.
అంతేకాదు మూత్రపిండాలకు సంబంధించిన అనేక సమస్యలకు చెక్ పెట్టడంలో సహాయపడుతుంది.
అధిక బరువుని తగ్గించుకోవడానికి, చెడు కొవ్వులను తగ్గించడానికి వెల్లుల్లి, నిమ్మరసం మిశ్రమం బాగా పని చేస్తుంది.
అధిక రక్తపోటుని, రక్తంలో షుగర్ స్థాయిలని తగ్గిస్తుంది.
గుండె ధమనులు గట్టి పడకుండా కాపాడుతుంది.
గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు, మధుమేహం, మూత్రపిండ సమస్యలు వంటి అనారోగ్య సమస్యలకు వెల్లుల్లి, నిమ్మరసం మిశ్రమం చక్కగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా సేకరించబడింది. దీని మీద అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.