మనం గుడికి వెళ్ళినప్పుడు పూజారి తీర్థం ఇస్తారు. అయితే మూడు సార్లు తీర్థం ఇవ్వడం జరుగుతుంది.

తీర్థం మూడు సార్లు తీసుకోవడానికి కారణం ఏంటి? అనేది చాలా మందికి తెలియదు.  

అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం, శ్రీ పరమేశ్వర పాదోదకం అని పురాణాల్లో చెప్పబడింది.

అకాల మరణం, సర్వ రోగాల నుంచి, సమస్త పాపాలను తొలగించే శక్తి తీర్థానికి ఉంటాయని శ్లోకంలో వివరించబడింది.

ఇక తీర్థం మూడు సార్లు తీసుకోవడానికి గల కారణం ఇలా చెప్పబడింది.

మొదటిసారి తీసుకునే తీర్థం శారీరక, మానసిక శుద్ధి కలుగజేస్తుంది.

తీర్థాన్ని రెండోసారి తీసుకోవడం వల్ల ధర్మం, న్యాయ పరివర్తన అలవడతాయి.

మూడోసారి తీసుకోవడం వల్ల పరమేశ్వరుని పరమ పదం లభిస్తుందని శ్లోకంలో చెప్పబడింది.

తీర్థాన్ని స్వీకరించేటప్పుడు కుడి చేతిని పైన పెట్టి చూపుడు వేలుని, బొటన వేలుని మారుస్తారు.

అప్పుడు గోముఖం ముద్ర వస్తుంది. ఇలా మడవడం వల్ల చైతన్యం సిద్ధిస్తుంది.

చాలా మంది తీర్థం తీసుకున్న తర్వాత అర చేతిని తలకు రాస్తారు. అయితే అలా చేయకూడదని శాస్త్రం చెబుతుంది.

తలపై బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు. తీర్థం తాగి ఆ చేతిని తలపై ఆనించడం అనేది ఎంగిలి అవుతుంది.

అంటే బ్రహ్మకు ఎంగిలి తీర్థం పెట్టినట్టు అవుతుంది. అందుకే తీర్థం తీసుకున్నాక తలపై చేతిని ఆనించకూడదు.

కళ్ళకు అద్దుకుంటే చాలని పండితులు చెబుతారు.