లవ్ చేయడం చాలా నార్మల్ విషయం. సృష్టిలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా కచ్చితంగా ప్రేమలో పడతారు.
రిలేషన్ పిష్ మొదలైన కొత్తలో బాగానే ఉంటుంది. కానీ తర్వాత తర్వాత మాత్రం బాండింగ్ తగ్గిపోతుంది.
ఈ క్రమంలోనే కనీసం రోజుకి ఒక్కసారైనా 'ఐ లవ్ యూ' చెప్పడం లేదని రోజూ గొడవ పడుతుంటారు.
ప్రేమ అంటే రోజూ 'లవ్ యూ' చెప్పాలా ఏంటా? అని ఈ టాపిక్ వచ్చిన ప్రతిసారి అమ్మాయి లేదా అబ్బాయి వాదిస్తుంటారు.
అలా చిన్న చిన్న గొడవలు అనుకున్నవి కాస్త పెరిగి పెద్దవిగా మారి బ్రేకప్ అయ్యేవరకు తీసుకెళ్తాయి.
ఒకవేళ ఇలా జరిగితే లవర్స్.. బ్రేకప్ సాంగ్స్ పెట్టుకోవడం, ఒంటరిగా బాధపడటం తప్ప మరోదారి కనిపించదు.
మీరు లవ్ చేసిన అమ్మాయి లేదా అబ్బాయికి 'ఐ లవ్ యూ' చెప్పకుండా ప్రేమని ఎక్స్ ప్రెస్ చేయాలనుకుంటున్నారా? ఇలా చేసేయండి.
మీ పార్ట్ నర్ ఏం చెప్పినా సరే మంచిగా వినండి. దీంతో వాళ్ల ఎమోషన్స్ మీకు బాగా అర్థమవుతాయి. ఇలా చేయడం వల్ల వాళ్లకు మీరు ఎంత స్పెషలో తెలుస్తుంది.
'ఎలా ఉన్నావ్?' అని అస్సలు అడగొద్దు. వాళ్ల ఫ్రెండ్స్ గురించి, చేస్తున్న పనులు గురించి మాట్లాడండి. ఇలా చేయడం వల్ల వాళ్లపై మీరు తీసుకుంటున్న కేర్ అర్థమవుతుంది.
మీ లవర్ తో ఖాళీ సమయాన్ని గడపండి. అన్ని రకాల విషయాలు మాట్లాడండి. అది మీ రిలేషన్ షిప్ వృద్ధి చెందడానికి సహాయపడుతుంది.
మీరు వెళ్లే రోడ్ ట్రిప్స్, ఫ్రెండ్స్ తో చేసుకునే పార్టీలకు మీ పార్ట్ నర్ ని కూడా తీసుకెళ్లండి. ఇలా చేయడం వల్ల మీ క్లోజ్ సర్కిల్ లో వాళ్లు కూడా ఉన్నారని అర్థం చేసుకుంటారు.
'మిస్సింగ్ యూ', 'త్వరలో కలుద్దాం' అనిపించే ఏమోజీలను మెసేజులుగా అప్పుడప్పుడు పంపిస్తూ ఉండండి. ఎంత బిజీగా ఉన్నాసరే మీరు వాళ్ల గురించి ఆలోచిస్తున్నారని అర్థమవుతుంది.
ఎప్పుడూ వాట్సాప్, ఇన్ స్టాలో మెసేజులు కాకుండా మీ ఫీలింగ్స్ ని పేపర్ పై పెట్టి లెటర్స్ రాయండి. వాళ్లకు ఇవ్వండి. వాళ్లకు మీరు ఎంత స్పెషల్ అనేది ఇది తెలియజేస్తుంది.
పబ్లిక్ లో మరీ మీ పార్ట్ నర్ అంటిముట్టనట్లు కాకుండా ఎఫెక్షన్ చూపించండి. మీ దగ్గర వాళ్ల కంఫర్ట్ గా ఉండేలా చూసుకోండి.
మీ పార్ట్ నర్ కు ఏమైనా సహాయం లేదా సలహా కావలంటే మీరు అందుబాటులో ఉండండి. మీరు ఎంత కేర్ తీసుకుంటున్నారో అది తెలియజేస్తుంది.
అప్పుడప్పుడు గిఫ్ట్స్ ఇచ్చి మీ లవర్ ని సర్ ప్రైజ్ చేయండి. వాళ్లతో వాళ్లు సమయం గడిపేలా కాస్త స్పేస్ ఇవ్వండి.
అన్నింటి కంటే ముఖ్యమైనది.. ఎప్పుడు కూడా వాళ్లపై ఆధిపత్యం చూపించకుండా వాళ్లని గౌరవించండి.
ఇలా పైన చెప్పినవి ఫాలో అయితే.. మీ మధ్య బాండింగ్ గట్టిపడుతుంది. బ్రేకప్ అనే మాటే వినిపించదు.
నోట్: పైన టిప్స్ పాటించిన తర్వాత ఏం జరిగినా పాజిటివ్ గానే తీసుకోవడం మర్చిపోవద్దు!