మాములుగా ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు ఆకుపచ్చని దుస్తువులు ధరిస్తుంటారు.

అసలు డాక్టర్లు ఆకుపచ్చ రంగుతో కూడిన దుస్తువులే ఎందుకు ధరిస్తారనేది చాలా మంది మెదళ్లలో మెదులుతున్న ప్రశ్న.

నిజానికి ఆకుపచ్చని రంగుతో  కూడిన దుస్తువులను వైద్యులు ఎందుకు ధరిస్తారు?

అసలు వైద్యులు ఆ డ్రెస్ గురించి ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

1914కి ముందు వైద్యులు ఆపరేషన్ సమయంలో తెల్ల రంగుతో కూడిన యూనిఫాం ధరిస్తూ ఉండేవారు. 

 1914 తర్వాత ఆపరేషన్ సమయంలో వైద్యులు ధరించే యూనిఫాంను ఆకుపచ్చ రంగుగా మార్చడం జరిగింది.

 ఆపరేషన్ చేసే సమయంలో ఆకుపచ్చని రంగుతో కూడిన దుస్తువులు ధరించడం ద్వారా ఎరుపు రంగును సున్నితంగా మారుస్తుందట.

ఆకు పచ్చని యూనిఫాంపై రక్తం పడితే... గోదుమ రంగులో కనిపించేలా చేస్తుందట. 

 ఇలాంటి ఆకుపచ్చని రంగుతో కూడిన యూనిఫాం ధరించడం వల్ల సర్జన్ చేసే సామార్ధ్యాన్ని కూడా పెంచేలా చేస్తుందట.

ఆపరేషన్ చేసే సమయంలో అలాంటి రంగుతో కూడిన యూనిఫాం ధరించడం ద్వారా కళ్లను సడలించడానికి తోడ్పడుతుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.