కొంతమంది.. వైద్యులు సూచించిన మందుల కన్నా.. ఆయూర్వేద మందులను వాడడానికి ఆసక్తి చూపిస్తుంటారు.
ఇప్పటికీ కూడా ఎంతో మంది ఆయుర్వేద మందులు వాడుతూ సత్ఫలితాలు పొందుతున్నారు.
ఇదిలా ఉంటే.. జామ ఆకులతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
అసలు జామ ఆకుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ఎలాంటి రకాల రోగాలకు వాడాలనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జామ ఆకులతో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
చిగుళ్లవాపు, పంటి నొప్పి వంటి సమస్య ఉన్నవారు జామ ఆకు తీసుకోవడం ద్వారా ఫలితాలు ఉంటాయట.
జామ ఆకులతో చేసిన టీ తాగితే కాస్త బరువు తగ్గే అవకాశాలు కూడా లేకపోలేదు.
కొన్ని జామ ఆకులను నీళ్లల్లో మరిగించి ఉడికించాలి. ఆ తర్వాత వడబట్టిన ఈ నీటిని తీసుకుని దాంట్లో మందార ఆకు, గోరింటాకు కలిపి జట్టుకు రాసుకోవాలి.
కొద్దిసేపటి తర్వాత షాంపోతో తల స్నానం చేస్తే జట్టు రాలే సమస్యను అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
వారానికి ఒకసారి ఇలా చేస్తే.. జుట్టు రాలే సమస్య నుంచి పూర్తిగా బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఒక జామ ఆకు, కొన్ని తులసి ఆకులు నూరి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మచ్చలు కూడా తగ్గుతాయట.