ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది సమయానికి భోజనం చేయడమే కాకుండా స్నానం కూడా చేయడం లేదు.

ఇలా సమయానికి చేయాల్సిన పనులు చేయకపోవడం వల్ల లేని పోని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.

మరీ ముఖ్యంగా రాత్రిపూట తలస్నానం చేయడం ద్వారా జుట్టు సమస్యలు లేకపోలేదని నిపుణులు తెలియజేస్తున్నారు. 

అసలు రాత్రిపూట తలస్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా రాత్రిళ్లు ఎక్కువగా తల స్నానం చేయడం అంత మంచిది కాదట.

అయితే రాత్రిపూట తల స్నానం చేసి కొంతమంది జుట్టు అరబెట్టకుండా అలాగే నిద్రపోతుంటారు. 

ఒకవేళ మీరు రాత్రిపూట స్నానం చేయాల్సి వస్తే.. ఆ తడి జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు.

దీంతో ఆ తడి జుట్టు పిల్లోకి అతుక్కని జుట్టు రాలే సమస్యకు దారి తీస్తుందని చెబుతున్నారు. 

అయితే జుట్టును స్నానం చేసిన తర్వాత జుట్టును అరబెట్టకుండా అలాగే పడుకుంటే.. చుండ్రు సమస్య కూడా రావచ్చిన  నిపుణులు తెలియజేస్తున్నారు. 

కొంతమంది మాత్రం.. రాత్రిపూట తిన్న తర్వాత తలస్నానం చేస్తుంటారు. ఇలా చేయడం అంత మంచిది కాదని సూచిస్తున్నారు.

రాత్రిపూట స్నానం చేయాల్సి వస్తే మాత్రం.. స్నానం చేసిన తర్వాతే భోజనం చేయాలని కూడా చెబుతున్నారు.

పైన తెలిపిన జాగ్రత్తలు పాటించినట్లైతే.. జుట్టు సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.