అలవాటు.. అలవాటుగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే అది వ్యసనంగా మారుతుందో అప్పుడే వారి జీవితాలు పతనం అవ్వడం స్టార్ట్ అవుతాయి.
ప్రస్తుత సమాజంలో నెలకొన్న వ్యసనాల్లో స్మోకింగ్ ఒకటి. ఇది అత్యంత డేంజరస్ అని తాగేవారికి సైతం తెలుసు.
కానీ ఈ అలవాటును మానలేకపోతుంటారు కొందరు. దీని వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
అయితే స్మోకింగ్ మానేయలేకపోయే వారికి ఈ 7 ఫుడ్ ఐటమ్స్ ను ట్రై చెయ్యండి అని సలహాలు ఇస్తున్నారు నిపుణులు.
స్మోకింగ్ కు బదులుగా పాలు తగమని చాలా మంది వైద్యులు సూచిస్తున్నారు.
పాలు తాగడం వల్ల సిగరెట్ లు తక్కువ రుచి అనిపిస్తాయట. దాంతో కొద్దికొద్దిగా ఆ అలవాటు తగ్గుతుందని వారి సూచన.
ఇక పండ్లు, కూరగాయలు తినడం వల్ల బాడీకి యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు లభిస్తాయి. ఇవి స్మోకింగ్ వల్ల మీ బాడీపై పడే నెగటీవ్ ఎఫెక్ట్స్ ను తగ్గిస్తాయి.
ఇక మీకు సిగరెట్ తాగాలి అనిపించినప్పుడల్లా పాప్ కార్న్ లేదా ఫాక్స్ నట్స్ తింటే మంచిదంట.
దాంతో మీకు సిగరెట్ తాగాలి అన్నదానిపై ధ్యాస పోతుందని నిపుణులు సూచిస్తున్నారు.
స్మోకింగ్ మానేసిన వ్యక్తులు ఎక్కువగా స్వీట్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతారని అధ్యయనాలు చెబుతున్నాయి.
స్మోకింగ్ అలవాటు పోవాలంటే మీ నోటిని బిజీగా ఉంచాలి. దానికి దాల్చిన చెక్క చక్కగా ఉపయోగపడుతుంటుంది. పొగతాగే కోరిక నుంచి ఇది దూరంగా ఉంచుతుంది.
ధూమపానానికి గుడ్ బై చెప్పాలి అంటే కచ్చితంగా బీన్స్ తినాలని చెబుతున్నారు ఆరోగ్య నిఫుణులు.
జిన్ సెంగ్ టీ తాగడం వల్ల డోపమైన్ ప్రభావం తగ్గుతుంది. స్మోకింగ్ చేసినప్పుడు మెదడులో డోపమైన విడుదల అవుతుంది.
వీటన్నింటి కంటే మీ దృఢమైన కోరికే.. మీ వ్యవసనాన్ని మరిపించగలదని గుర్తుంచుకోండి.
నోట్: పై చిట్కాలు పాటించే ముందు మీ దగ్గర్లోని డాక్టర్ల, నిపుణుల సలహాలు తీసుకోండి.