పెరుగు, మజ్జిగ లేని ఇల్లు ఉండదు. భోజనం ఆఖరున పెరుగు వేసుకుని తినడం అనేది అనాదిగా వస్తున్న అలవాటు.
పెరుగు వల్ల అనేక వీటి నుంచి శరీరానికి అనేక రకాల పోషకాలు లభిస్తాయి. అయితే పెరుగు కంటే మజ్జిగ తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా.. వేడిని తాకినప్పుడు పులియబెడుతుంది.
కడుపులోకి వచ్చినప్పుడు పొట్టలో ఉండే వేడి ఆమ్లాలు పెరుగుని పులియబెడతాయి. దీని వల్ల కడుపులోని పేగులు వేడెక్కుతాయి.
అదే పెరుగు నుంచి వచ్చిన మజ్జిగ మాత్రం శరీరాన్ని చల్లగా ఉంచుతుందని చెబుతున్నారు.
పెరుగు వల్ల కొవ్వు, బలం పెరుగుతుంది. ఊబకాయం, కఫ సమస్యలు, రక్తస్రావం, వాపు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు పెరుగుకి దూరంగా ఉండాలి.
రాత్రిపూట పెరుగు తింటే జలుబు, దగ్గు, సైనస్ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అంతగా పెరుగు తినాలకుంటే చిటికెడు మిరియాలు గానీ, మెంతులు గానీ వేసుకుని తినాలని సూచిస్తున్నారు.
కొంతమంది పెరుగుని వేడి చేసి.. మజ్జిగ చారు చేసుకుని తింటారు. ఇలా చేయడం వల్ల మంచి బ్యాక్టీరియా నశిస్తుంది.
మజ్జిగలో జీలకర్ర పొడి, పింక్ సాల్ట్, కొత్తిమీర వేసి తాగితే రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
మజ్జిగ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణసమస్యలు, ఆకలి లేకపోవడం, వాపు, రక్తహీనత వంటి సమస్యలను మజ్జిగ నియంత్రిస్తుంది.
మజ్జిగ తేలికగా ఉండడం వల్ల సులువుగా జీర్ణమవుతుంది. ఆకలిని ప్రేరేపించడానికి సహాయపడుతుంది.
పెరుగు తింటేజీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మలబద్ధకం, యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవాళ్లు మజ్జిగ తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
బరువు తగ్గాలనుకునేవారు మజ్జిగ తాగాలి. బరువు పెరగాలనుకుంటే పెరుగు తినాలి. మజ్జిగ తాగడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.